మగబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి
రాజ్ కుంద్రా తన ట్విట్టర్లో " దేవుడు నాకు అందమైన మగబిడ్డను ప్రసాదించి ఆశీర్వదించాడు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని థ్రిల్లింగ్ రోజు. నాకు వారసున్ని ప్రసాదించినందుకు మా ఆవిడకు పెద్ద థాంక్స్. అదే విధంగా డాక్టర్ కిరణ్ చాహెలో, హిందూజా ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు'' అంటూ పేర్కొన్నారు.
ఈ శుభవార్త వినగానే...శిల్పా శెట్టి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆసుపత్రికి చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలో పెద్ద పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు రాజ్ కుంద్రా.
గతంలో శిల్పా శెట్టి గర్భం ధరించినప్పటికీ గర్భస్రావం కావడంతో అది నిలవలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి అంతా టెన్షన్ పడ్డారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా సుఖ ప్రసవం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వెంకటేష్ హీరోగా వచ్చిన 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి ఆ తర్వాత 'వీడేరా దాని బాబు', నాగార్జున సరసన'ఆజాద్', బాలయ్య సరసన 'భలేవాడివి బాసు' చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications












