Shilpa Shetty బట్టలు విడిపించి.. నగ్నంగా నిలబెట్టి అలాంటి అరాచకం!
లండన్‌కు చెందిన వ్యాపారవేత్తగా కంటే పాపులర్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్తగానే రాజ్ కుంద్రా తెలుసు. అయితే ఆయన జీవితం అనేక రకాలుగా వివాదాల్లో కూరుకుపోయింది. నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచే ఆయన ఏకంగా నటుడిగా మారారు. అది కూడా తన జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో రాజ్ కుంద్రానే నటించడం ఆసక్తికరంగా మారింది. అయితే తన సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ..
గతేడాది రాజ్ కుంద్రా నేషనల్ మీడియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పోర్న్ వీడియోల కుంభకోణంలో కేసులో ముంబై పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చాలా రోజులు ఆయన ముంబైలోని జైలులో రిమాండ్‌లో ఉన్నారు. చాలా రోజుల న్యాయపోరాటం తర్వాత బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు.

తన జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న UT69 చిత్రంలో తన పాత్రలోనే రాజ్ కుంద్రా నటించారు. ఈ సినిమాను భారీగా బాలీవుడ్‌లోను, దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు. తన సినిమా గురించి, తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను ఆయన వెల్లడిస్తున్నారు. రాజ్ కుంద్రా చెప్పిన విషయాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
UT69 సినిమా ప్రమోషన్‌లో భాగంగా పోర్నోగ్రఫి కుంభకోణం కేసులో ఆర్ధర్ రోడ్ జైలులో జరిగిన సంఘటనలను వివరించారు. జైలుకు నన్ను తీసుకెళ్లిన తర్వాత బట్టలు విడిపించి.. అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు అనే విషయాన్ని మీడియాకు చెప్పారు. నాతో చాలా దారుణంగా ప్రవర్తించడమే కాకుండా పోలీసులు అరాచకం సృష్టించారు అని పేర్కొన్నారు.

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తీసుకెళ్లిన తర్వాత నా ఒంటిపై ఉన్న బట్టలు ఊడదీశారు. నన్ను వంగబెట్టి నా వెనుక భాగంలో చెక్ చేశారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకొచ్చావా? అంటూ చెక్ చేశారు. అలాంటి ట్రీట్‌మెంట్ చూసిన తర్వాత జీవితంలో బతికి ఉన్నా చచ్చినట్టే అనే ఫీలింగ్ కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకొన్న గౌరవం మట్టిలో కలిసిందనే భావన నాలో కలిగింది అని రాజ్ కుంద్రా చెప్పారు.

జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా బట్టలు విడిపించినంత పని చేసింది. నాపై దారుణంగా కథనాలు రాశారు. నా ఫ్యామిలీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఏదైనా తప్పు చేస్తే నన్ను లాగండి. కానీ నా భార్యను, నా పిల్లల గురించి మాట్లాడకండి అని అన్నారు. పోర్న్ వీడియోల కుంభకోణంలో నేను దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. చాలా విషయాలను నా బయోపిక్‌లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని రాజ్ కుంద్రా చెప్పారు.


Click it and Unblock the Notifications











