తెరమరుగు అవుతున్న దశలో బిగ్ బ్రదర్ వివాదంతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన శిల్పాశెట్టి మరో సారి అదే ట్రిక్ ఫాలో అవుతోంది.తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకుందని ఓ వెబ్ సైట్ రాసిందని సైబర్ కోర్టులో కేసు ఫైల్ చేసింది.నిజానికి ఆమె తన ఫ్యామిలీ తో కలిసి సాయిబాబా గుడికి వెళ్ళిందిట.అక్కడ ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసాడుట.ఇది చూసిన పేపర్లు త్వరలో పెళ్ళి అని రాసాయి.కాని ఓ వెబ్ సైట్ మాత్రం కొంత ముందుకు వెళ్లి సీక్రెట్ గా పెళ్ళి ..కుంటుంబం మాత్రమే హాజరు అని సెన్సేషన్ చేసిందిట.వివాదమే విజయ రహస్యం అని నమ్మే శిల్పా తనకు అలవాటైన రీతిలో వివాదానికి పూనుకుంది.తారల లైఫ్ లో కామన్ గా కనిపించే గాసిప్స్ ని పెద్దగా చేద్దామనుకుంటోంది.చూద్దాం ఈ గేమ్ లో శిల్పా ఏ మేరకు లబ్ధి పొందుతుందో!