»   » లగ్జరీ లైఫ్: ప్రైవేట్ జెట్ విమానంలో సినీ‌తారలంతా పార్టీ.. (ఫోటోస్)

లగ్జరీ లైఫ్: ప్రైవేట్ జెట్ విమానంలో సినీ‌తారలంతా పార్టీ.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లగ్జరీ లైఫ్ అంటే సినీ తారలదే! చేతి నిండా సంపాదన, విలాసవంతమైన సౌకర్యాలు...... అడుగులుకు మడుగుల ఒత్తే సేవకులు, జేజేలు కొట్టే అభిమానులు. ఇక ప్రయాణాలైతే కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు, విమానాల్లోనే. తాజాగా బాలీవుడ్లో స్టార్స్ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు.

స్టార్స్ కలిసి ప్రైవేట్ జెట్ విమానంలో ముంబై నుండి ఇండోర్ వెళ్లారు. ఫిబ్రవరి 16న ఇండోర్ లో శిల్పా శెట్టి దంపతులు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్నవారంతా టాప్ లిస్టు స్టార్లే ఉండటం గమనార్హం. ఇందుకు సంబందించిన ఫోటోలు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు తమ సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

‘ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ తో ఫస్ట్ క్లాస్' విమానంలో చాలా ఎంజాయ్ చేసాం అంటూ చెప్పుకొచ్చారు. రాజ్ కుంద్రా మరో అడుగు ముందుకేసి సొంతగా ప్రైవేట్ జెట్ విమానం ఉంటే ఆ మాజయే వేరు, నచ్చిన సమయంలో స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశానికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

ఈ పార్టీలో....శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, అనిల్ కపూర్, టబు, హుమా ఖురేషి, జాకీ ష్రాఫ్, సంజయ్ కపూర్ దంపతులు... ఇలా చాలా మంది పాల్గొన్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

బాలీవుడ్ స్టార్స్..

బాలీవుడ్ స్టార్స్..

బాలీవుడ్ సినీ తారలంతా కలిసి ఇలా ప్రైవేట్ జెట్ విమానంలో ముంబై నుండి ఇండోర్ వెళ్లారు.

ఫస్ట్ క్లాస్

ఫస్ట్ క్లాస్

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 హ్యాపీ...

హ్యాపీ...

‘ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ తో ఫస్ట్ క్లాస్' విమానంలో చాలా ఎంజాయ్ చేసాం అంటూ చెప్పుకొచ్చారు ఈ దంపతులు.

రాజ్ కుంద్రా

రాజ్ కుంద్రా

సొంతగా ప్రైవేట్ జెట్ విమానం ఉంటే ఆ మాజయే వేరు, నచ్చిన సమయంలో స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశానికి వెళ్లి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు రాజ్ కుంద్రా.

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి

ఇండోర్ లో జరిగిన పార్టీలో శిల్పా శెట్టి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu