శిల్పా శెట్టికి బ్యాగు తెచ్చిన తంటా.. విమానాశ్రయంలో ఆపేసిన సిబ్బంది!
బాలీవుడ్ సెలెబ్రెటీలకు తరచుగా విమానాశ్రయాల్లో విచితమైన సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టికి సిడ్నీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చాలా సమయం పాటు శిల్పా శెట్టిని సిబ్బంది ఆపేశారు. సాలు ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే.. శిల్పా శెట్టి సిడ్నీ నుంచి మెల్బోర్న్ వెళ్లేందుకు పెద్ద బ్యాగుతో బయలు దేరింది.
చెక్ ఇన్ కౌంటర్ వద్ద శిల్పా శెట్టి లగేజ్ ఎక్కువగా ఉందని ఆమెని అక్కడే ఆపేశారు. బ్యాగు పెద్దదిగా ఉందని సిబ్బంది కారణం చెప్పారు. బ్యాగులో లగేజి ఎక్కవ ఏం లేదని కావాలంటే బ్యాగుని తెరచి కూడా చూసుకోవచ్చని సిబ్బందికి సూచించింది. కానీ తన మాటలని అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోలేదని వాపోయింది.

ఎట్టకేలకు శిల్పా శెట్టి బ్యాగుని ఓవర్ సైజ్ లగేజ్ విభాగం వాళ్ళు పరిశీలించి లగేజ్ ఎక్కువ లేదని నిర్ధారించారు. ఆ తరువాతే శిల్పా శెట్టి ప్రయాణం కొనసాగింది. ఈ మొత్తం వ్యవహారం తనని ఎంతగానో బాధించిందని శిల్పాశెట్టి తెలిపింది. ప్రయాణికుల విషయంలో జాతి వివక్ష చూపించడం ఏంటని సోషల్ మీడియాలో పెట్టింది.


Click it and Unblock the Notifications











