ముద్దొస్తున్న శిల్పా శెట్టి కొడుకు (ఫస్ట్ లుక్ ఫోటోలు)
ముంబై: సినిమా స్టార్లు ఎక్కడికెళ్లినా వాళ్లు సెంటరాఫ్ అట్రాక్షన్ మారి పోతారు. ఇక వారికి పిల్లలుంటే, అందులోనూ వారు ఇప్పటి వరకు ఎవరీకి కనిపించకుండా తొలి సారిగా వారి ఫేస్ బయటి ప్రపంచానికి కనిపిస్తే అందరి చూపులు వారిపైనే. ఇక మీడియా హడావుడి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాలిన పని లేదు.
తాజాగా మాజీ సెక్సీ హీరోయిన్ శిల్పాశెట్టి తన కొడుకు 'వియాన్'ను తొలిసారిగా పబ్లిక్‌లోకి తీసుకొచ్చింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు కొడుకుతో పాటు హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు క్రింది స్లైడ్ షోలో వీక్షించ వచ్చు. గతంలో ఓసారి కొడుకుతో పాటు ఎయిర్ పోర్టులో మీడియాకు చిక్కిన శిల్పా.... వియాన్ ఫేస్ ఎవరికీ కనిపించకుండా కవర్ చేసింది.
శిల్పా శెట్టి మే 21, 2012న వియాన్‌కు బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలిసారి వియాన్ ఫేస్ ప్రపంచానికి కనిపించడంతో ఫోటో గ్రాఫర్లు అతన్ని తమ కెమెరాల్లో బంధించడానికి పోటీ పడ్డారు. మరి ముద్దొస్తున్న వియాన్ ఫస్ట్ లుక్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

గతంలో శిల్పా శెట్టి గర్భం ధరించినప్పటికీ గర్భస్రావం కావడంతో అది నిలవలేదు. రెండోసారి గర్భం ధరించినప్పుడు వియాన్ జన్మించాడు.

ఎన్నో మొక్కుల తర్వాత కలిగిన సంతానం కావడంతో శిల్పా, రాజ్ కుంద్రాలు వియాన్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

శిల్పా శెట్టి ఇప్పుడు తన పూర్తి సమయాన్ని వియాన్ పెంపకానికే కేటాయిస్తోంది.

శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం క్రితమే పరిచయం అయింది.

వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సాహస వీరుడు సాగర కన్య' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి ఆ తర్వాత ‘వీడేరా దాని బాబు', నాగార్జున సరసన ‘ఆజాద్', బాలయ్య సరసన ‘భలేవాడివి బాసు' చిత్రాల్లో నటించింది.

వియాన్‌తో శిల్పా శెట్టి.


Click it and Unblock the Notifications











