షూటింగులో ఉండగా గర్భం దాల్చొద్దు, హీరోయిన్ మద్దతు!

'సినిమా షూటింగులో ఉండగా గర్భం దాల్చొద్దనే నిబంధనకు నేనూ మద్దతు పలుకుతున్నాను. సినిమా ప్రాజెక్టు నాలుగైదు సంవత్సరాల పాటు కొనసాగితే ఈ నిబంధన ఆమోద యోగ్యంకాదు కానీ, ఒక సంవత్సరం లోపు పూర్తయ్యే ప్రాజెక్టుల విషయంలో ఈ నిబంధన ఆమోద యోగ్యమే. నో ప్రెగ్నెన్సీ నిబంధన తప్పు కాదనేది నా వ్యక్తి గత అభిప్రాయం' అని శిల్పా శెట్టి చెప్పుకొచ్చారు.
సినిమాకు కమిటై డేట్స్ ఇచ్చి.....సగం సినిమా పూర్తయిన తర్వాత గర్బం దాల్చి షూటింగులకు దూరంగా ఉండటం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఐశ్వర్యరాయ్ 'హీరోయిన్' అనే సినిమాకు డేట్స్ ఇచ్చి...ఆ తర్వాత గర్భం దాల్చింది. దీంతో దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు కరీనా కపూర్‌తో ఆ చిత్రం పూర్తి చేసారు.
ఇటీవల విద్యా బాలన్ కూడా గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలు సంచలనం రేకెత్తించాయి. ఎందుకంటే విద్యాబాలన్ ఇప్పటికే చాలా సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలు నిర్మాతలకును కంగారు పెట్టాయి. అయితే విద్యాబాలన్ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications











