నిర్మాతగా మరో హీరోయిన్

By Staff

Shilpa Shetty
తమకు ఇక బయిట బ్యానర్ల నుండి సినిమాలు వచ్చే అవకాశం లేదు. మనతో సినిమా చేస్తే మట్టే నని అందరికీ అర్ధమయిపోయిందని తెలిసినప్పుడు చాలామంది హీరోలు, దర్శకులు స్వంత బ్యానర్లు స్ధాపించేసి సినిమాలు తీసేసి తమలో ఇంకా వెలికి తీయని ప్రతిభ చాలా ఉందని నిరూపించే ప్రయత్నాలు చేస్తూండటం ఆనవాయితి. అయితే దానికి 'ఇది కొంచెం ప్రయేగం రిస్క్ ఎందుకని మేమే చేస్తున్నామని' గొప్పలు చెప్తుంటారు. ఇక మరో వర్గం తమ పాపులారీటీని వేరే వాళ్ళు క్యాష్ చేసుకోవటమెందుకు ఆలోచించి, తెలిసిన వాళ్ళకు చాలా తక్కువ మొత్తాలు ఇచ్చి సినిమాలు చుట్టి తమ గుడ్ విల్ ని డబ్బుచేసుకుంటూంటారు.అదే దారిలో ఇప్పుడు శిల్పాశెట్టి వచ్చి చేరుతోంది.

గతంలో బాలీవుడ్ లో జూహీచావ్లా అలా నిర్మాతగా ప్రవేశించి చేతులు కాల్చుకుంది. ఇక మనకు ప్రస్తుతం భూమిక ఆ ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న బిగ్ బ్రదర్ వివాదం దగ్గరనుండి హాట్ గా మారిన ఆమె నిర్మాతగా యేడాదికి రెండు సినిమాలు తీయాలని నిర్ణయించుకుందిట. S2 గ్లోబర్ ప్రొడక్షన్స్ అనే టైటిల్ తో బ్యానర్ స్టార్ట్ చేసినామె ఓ భారీ యాక్షన్ కామిడీతో శ్రీకారం చుడుతోంది. ఈ తొలి చిత్రానికి మనీష ఝూ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో శిల్పా కనపడే అవకాశం లేదట. ఇక నుంచి శిల్పా తన లోని క్రియేటివిటీని సాటిస్ ఫై చేసే పాత్రలు చేస్తానంటోంది. అలాగే శిల్ప ఇప్పుడు హనుమాన్ సినిమాలో సీత గానూ, సన్నీడయోల్ ది మాన్ లో తన స్వీయ జీవతాన్ని పోలిన పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X