బర్త్ డే స్పెషల్: నాగ చైతన్య, సమంత మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ వచ్చేసింది!
Recommended Video

పెళ్లైన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో నిన్నుకోరి ఫేమ్ శివనిర్వాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మజిలీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
నేడు నాగ చైతన్య పుట్టినరోజు (నవంబర్ 23) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చైతన్య వింటేజ్ లుక్ చూస్తుంటే 80'స్ నాటి కథతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిచంబోతున్నారట.

బర్త్ డే హ్యాపీ బర్త్ డే నాగ చైనత్య
షైన్ స్క్రీన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొన్ని రోజులుగా వైజాగ్ లో జరుగుతున్న షెడ్యూల్ రెండు రోజుల క్రితమే పూర్తయింది. నాగ చైతన్య బర్త్ డే ఉండటంతో వైజాగ్ షెడ్యూల్ ముందే పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. నవంబర్ 26 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.

సమంత-నాగ చైతన్య
సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న నాలుగో సినిమా ఇది. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఏమాయ చేశావే', ‘మనం' చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

సెకండ్ హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్
ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. తణికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, రవిప్రకాశ్, కరణ్, రాజశ్రీ నాయర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శివ నిర్వాన
నిర్మాతలు: సాహు గరపాటి, హరీష్ పెద్ది
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్


Click it and Unblock the Notifications











