twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను రేప్ చేసాననే నన్ను అలా ఆడుకున్నారు: నటుడు షైనీ ఆహుజా

    |

    గ్యాంగ్‌ స్టర్‌, లైఫ్‌ ఇన్‌ మెట్రో, భూల్‌ భూలాయియా లాంటి హిట్‌ సినిమాల్లో నటించిన షైనీ ఆహుజా గుర్తున్నాడా..? సినిమాల్లో పెద్దగా పేరు రాలేదు కానీ లైంగికంగా వేధించాడని ట్రైన్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన సయాలీ భగత్ చేసిన ఆరోపనల వల్లా..తన ఇంటి పని మనిషి మీదే అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది.

    మామూలుగా కొన్నాళ్ళు వాదనల తర్వాత ముగిసిపోతుందీ అనుకున్న ఈ కేసు బలంగానే ఉండి కనీసం ఏడేళ్ళ జైలుశిక్ష పడేలా ఉంది. ఆ కేసులో పోరాడుతూ.. బెయిల్‌ మీద బయటే తిరుగుతున్నాడు షైనీ ఆహుజా. ఈ కేసు వళ్ళ సినిమా అవకాశాలు మొత్తం పోయినట్టే ఇక దీంతో అతడి సంగతి అందరూ మరిచిపోయారు. ఇలాంటి టైంలో ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చాడు షైనీ.

    Shiney Ahuja sends legal notice to makers of 'Great Grand Masti'

    నటనను నేను వృత్తిగా భావించడం లేదు.. నాకు సినిమాలంటే వ్యామోహం, తన జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఈ రంగాన్ని వదిలిపెడదామని అనుకున్నాను, కానీ ఆ వ్యామోహమే నన్ను ఈ రంగాన్ని అంటి పెట్టుకునేలా చేసింది అని షైనీ ఆహుజా వెల్లడించారు. అత్యాచారం కేసు నా జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది, మరింత అణకువగా ఉండటం నేర్చుకున్నానని కూఅడా ఆ మధ్య అన్నాడు.

    ఈ శుక్రవారం బాలీవుడ్లో 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' అనే అడల్ట్‌ కామెడీ మూవీ ఒకటి రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పని మనిషి పాత్రకు 'షైనీ' అంటూ తన పేరు పెట్టడం మీద అతను గొడవ చేస్తున్నాడు. దీనిపై అతను పోలీస్‌ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు. ఇందులో తన పేరు వినియోగించకుండా చూడాలని అతను పిటిషన్లో కోరాడు.

    లేని పక్షంలో సినిమాను ఆపేయాలని అంటున్నాడు. షైనీ పనిమనిషిని రేప్‌ చేసిన కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో కావాలనే పనిమనిషి పాత్రకు 'షైనీ' అనే పేరు పెట్టారన్న సంగతి ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది. ఇంతకీ ఈ సినిమాలో షైనీ అనే పనిమనిషి పాత్ర ఉందని సినిమా విడుదలకు ముందే అతడికెలా తెలుసన్న సందేహం రావచ్చు. 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ' ఆల్రెడీ లీక్‌ అయి.. నెట్లోకి వచ్చేసింది. బహుశా ఆ పైరసీ ప్రింటే చూశాడో.. అది చూసిన వాళ్ల నుంచి సమాచారం తెలుసుకున్నాడో కానీ.. దాని దర్శక నిర్మాతలపై కేసు అయితే పెట్టేశాడు షైనీ. మరి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.

    English summary
    Actor Shiney Ahuja has sent a legal notice to the film's producers, Balaji Motion Pictures, and its honcho Ekta Kapoor, as well as director Indra Kumar, over what he says is a derogatory reference to him in Great Grand Masti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X