twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె అంగీకారంతోనే సెక్స్ లో ...

    By Staff
    |

    బాలీవుడ్ నటుడు అహుజా అత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తాను పనిమనిషిపై అత్యాచారం జరపలేదని, ఆమె అంగీకారంతోనే తనతో శృంగారంలో పాల్గొన్నానని బాలీవుడ్ నటుడు అహుజా వెల్లడించారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు తన ప్రతిష్టను దిగజార్చి, డబ్బులు గుంజడానికే తనను అత్యాచారం కేసులో ఇరికించారని అతను ఆరోపించారు. పనిమనిషిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

    దీనిపై ముంబై సెషన్స్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తాను పనిమనిషిపై అత్యాచారం చేయలేదని, ఇది ఆమె అంగీకారంతోనే జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన శరీరంపై చిన్నపాటి గోళ్ళ గుర్తులుండటంతో అత్యాచారమని ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. ృంగారంలో ఇలాంటి గాయాలు సహజమేనని ఆయన పేర్కొన్నారు. తాను జైలులో ఉండటంమూలాన తన సినిమాలు చాలావరకు నిలిచిపోయాయని, దీంతో సదరు నిర్మాతలు, దర్శకులు, తోటి నటులు ఇబ్బందులకు గురౌతున్నారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఇదిలావుండగా దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.వి. కిని వాదిస్తూ...ఇలాంటి దశలో బెయిల్ మంజూరు చేస్తే విచారణపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. కాగా డీఎన్ఏ, వైద్య పరీక్షల ఆధారంగా అహుజాపై పోలీసులు బలమైన కేసును నమోదు చేశారని, చార్జిషీటు దాఖలు చేసేదాకా ఆయనను బెయిల్‌పై విడుదల చేయరాదనిఆయన కోర్టును కోరినట్లు సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X