Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆమె అంగీకారంతోనే సెక్స్ లో ...
బాలీవుడ్ నటుడు అహుజా అత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తాను పనిమనిషిపై అత్యాచారం జరపలేదని, ఆమె అంగీకారంతోనే తనతో శృంగారంలో పాల్గొన్నానని బాలీవుడ్ నటుడు అహుజా వెల్లడించారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు తన ప్రతిష్టను దిగజార్చి, డబ్బులు గుంజడానికే తనను అత్యాచారం కేసులో ఇరికించారని అతను ఆరోపించారు. పనిమనిషిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ముంబై సెషన్స్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తాను పనిమనిషిపై అత్యాచారం చేయలేదని, ఇది ఆమె అంగీకారంతోనే జరిగిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తన శరీరంపై చిన్నపాటి గోళ్ళ గుర్తులుండటంతో అత్యాచారమని ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. ృంగారంలో ఇలాంటి గాయాలు సహజమేనని ఆయన పేర్కొన్నారు. తాను జైలులో ఉండటంమూలాన తన సినిమాలు చాలావరకు నిలిచిపోయాయని, దీంతో సదరు నిర్మాతలు, దర్శకులు, తోటి నటులు ఇబ్బందులకు గురౌతున్నారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదిలావుండగా దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.వి. కిని వాదిస్తూ...ఇలాంటి దశలో బెయిల్ మంజూరు చేస్తే విచారణపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. కాగా డీఎన్ఏ, వైద్య పరీక్షల ఆధారంగా అహుజాపై పోలీసులు బలమైన కేసును నమోదు చేశారని, చార్జిషీటు దాఖలు చేసేదాకా ఆయనను బెయిల్‌పై విడుదల చేయరాదనిఆయన కోర్టును కోరినట్లు సమాచారం.