నాగ్ ‘శిరిడి సాయి’ ఇతర భాషల్లోకి అనువాదం
హైదరాబాద్ : నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో భక్తిరస చిత్రం 'శిరిడి సాయి' చిత్రం హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని అన్ని బాషల్లోకి అనువదించాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా శిరిడి సాయి భక్తులు ఉండటం, నాగార్జున లాంటి స్టార్ హీరో షిరిడి సాయి పాత్రలో నటిస్తుండటంతో ఈచిత్రానికి ఇతర బాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
మీరు సాయి భక్తులు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఒక వేళ మీరు శిరిడి సాయి బాబా భక్తులు అయి ఉండక పోతే తప్పకుండా బాబాకు భక్తులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఇక సాయి బాబా పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారు. ఆయన ఈ చిత్రంలో నటనకుగాను పలు అవార్డులు వరించడం ఖాయం. రక్తిరసంతో కూడిన సినిమాలను తాను ఏ రేంజిలో హ్యాండిల్ చేయగలనో...భక్తి రసంతో కూడిన సినిమాలను కూడా అంతకంటే బాగా, ప్రేక్షక రంజకంగా హ్యాండిల్ చేయగలనని రాఘవేంద్రరావు మరోసారి నిరూపించారని అంటున్నారంతా.
గతంలో నాగ్-రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'శిరిడి సాయి' చిత్రంతో హాట్రిక్ కొట్టారు. ఇక సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చాయి.
శిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.


Click it and Unblock the Notifications











