ప్రసాదం, విభూతితో 'శిరిడి సాయి'టిక్కెట్లు
హైదరాబాద్ : నాగార్జున 'శిరిడి సాయి' చిత్రం సెప్టెంబర్ ఆరున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఓవర్ సీస్ రైట్స్ తీసుకున్న శ్రీ లక్ష్మీ సాయి ఫిల్మ్ వారు డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు. వారు ఈ సినిమాకు వచ్చే ఆడియన్స్ కు వంద కేజీల ప్రసాద్,ముప్పై కేజీల విభూది ధియోటర్లో పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక లోకల్ గా ఉండే గుళ్లు అధార్టీస్ రిక్వెస్టు మేరకు ఇంగ్లీష్ స్ టైటిల్స్ తో విడుదల చేస్తున్నారు.దుబాయి,ఆస్ట్రేలియా,యుకె,సింగపూర్,కెనడా,సౌత్ ఆప్రికా,యుగాండా,జర్మనీ మినహా కేవలం యుఎస్ లో 75 ధియోటర్లలో విడుదల చేస్తున్నారు.
నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...రాఘవేంద్రరావు,నా కాంబినేషన్ అంటే ఈ తరహా సినిమాలే ఊహిస్తారు ప్రేక్షకులు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' తర్వాత కేరక్టర్లు ఇంకేం లేవనుకున్నాం. మైండ్‌లో ఏమీ లేవు. కేరక్టర్లు వెతకాలి అనుకున్నాం. 'శిరిడిసాయి' వచ్చింది. 'శిరిడిసాయి'చెయ్యడం చక్కటి అనుభవం. రాఘవేంద్రరావుగారు, నేను కలిసి చేసిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'ను జనం బాగా ఆదరించారు. ఆ పాత్రల్లో నన్ను అంగీకరించారు. 'శిరిడిసాయి' సినిమా చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా సింపుల్. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వయసు వారైనా సులువుగా చేరే దేవుడు సాయి. అందరినీ ప్రేమించు అనే ఆయన తత్వం బాగా నచ్చింది అన్నారు.
నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటించారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, సంగీతం: కీరవాణి.


Click it and Unblock the Notifications











