నాగార్జున ‘షిరిడి సాయి’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ఎంతటి ఘటన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో వస్తోన్న 'షిరిడి సాయి' చిత్రంపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈచిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈచిత్రం విడుదల కోసం నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎ. సులోచనారెడ్డి సమర్పణలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి పతాకంపై ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్న 'షిరిడి సాయి' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... షిరిడి సాయి చిత్రం క్లీన్ 'యూ' సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఒక మహాద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మా యూనిట్‌ని ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు, సాయిబాబా భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్లో మొదటి సినిమాగా వస్తోన్న 'షిరిడి సాయి' చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం మా యూనిట్ లోని ప్రతి ఒక్కరికీ ఉంది' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఫోటో గ్రఫీ: ఎస్. గోపాల్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, నిర్మాత: ఎ. మహేష్ రెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.


Click it and Unblock the Notifications











