twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘శిరిడి సాయి’ టాక్ ఏంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో భక్తిరస చిత్రం 'శిరిడి సాయి'. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై గుడ్ టాక్ తెచ్చుకుంది. మీరు సాయి భక్తులు అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఒక వేళ మీరు శిరిడి సాయి బాబా భక్తులు అయి ఉండక పోతే తప్పకుండా బాబాకు భక్తులు అవుతారనే టాక్ వినిపిస్తోంది.

    ఇక సాయి బాబా పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారు. ఆయన ఈ చిత్రంలో నటనకుగాను పలు అవార్డులు వరించడం ఖాయం. రక్తిరసంతో కూడిన సినిమాలను తాను ఏ రేంజిలో హ్యాండిల్ చేయగలనో...భక్తి రసంతో కూడిన సినిమాలను కూడా అంతకంటే బాగా, ప్రేక్షక రంజకంగా హ్యాండిల్ చేయగలనని రాఘవేంద్రరావు మరోసారి నిరూపించారని అంటున్నారు నాగార్జున అభిమానులు.

    గతంలో నాగ్-రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా 'శిరిడి సాయి' చిత్రంతో హాట్రిక్ కొట్టారు. ఇక సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చాయి. డైలాగులు, సినిమాటోగ్రపీ బాగుంది. ప్రేమ తత్వాతన్ని, మంచి పనులు అలవరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.

    షిరిడి సాయి చిత్రానికి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు.

    English summary
    Akkineni Nagarjuna has won the heart of his brilliant acting as God-man in his previous movies like Annamayya and Srirama Dasu, which were directed by K Raghavendra Rao. After the success of these movies, the King has once again joined hands with the director for his latest outing Shirdi Sai. Prior to its release, the film has created quite a buzz and the actor has made sure that his performance meets all those expectations. You will definitely like the movie. Though you are not a Sai devotee watch the film. It is for sure that you will turn a Sai devotee soon after watching the film. The background score, songs, scenes, dialogues and direction will take to another world of devotion for a period of two hour and twenty minutes. Definitely, Nagarjuna would bag awards and rewards for his performance as Shirdi Sai. Sai Ram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X