ఫ్యాన్సీ రేటుకి నాగ్ ‘షిరిడి సాయి’ ఓవర్సీస్ రైట్స్
హైదరాబాద్: అక్కినేని నాగార్జున నటిస్తున్న మరో భక్తిరస చిత్రం 'షిరడి సాయి' ఓవర్సీస్ రైట్స్ శ్రీ లక్ష్మి సాయి ఫిలింస్ వారు ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. థియేట్రికల్ రైట్స్ తో పాటు డివిడి రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. గతంలో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామ దాసు చిత్రాలు మంచి విజయం సాధించడంతో 'షిరిడి సాయి' చిత్రానికి ఓవర్సీస్ లో డిమాండ్ ఏర్పడింది.
ఈచిత్రం షిరిడి సాయి బాబా చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సాయిబాబా చరిత్రపై పలు చిత్రాలు వచ్చినప్పటికీ దర్శకేంద్రుడు ఈచిత్రాన్ని తనదైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున చేస్తున్న సాయి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయిబాబా గెటప్ లో నాగార్జున ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఆడియో మంచి విజయం సాధించింది. తన సినిమాల్లో రక్తి రసాన్ని ఓ రేంజిలో చూపిస్తూ ప్రేక్షకులను మత్తెక్కించే రాఘవేంద్రరావు...అందుకు ఏమాత్రం తగ్గకుండా భక్తి రసాన్ని ఒలికించి ప్రేక్షకులను మైమరిపించడంలో దిట్ట. భక్తిరస చిత్రమైనా ఆయన టేకింగ్ ప్రత్యేకంగా ప్రేక్షక రంజకండా ఉండటమే అదుకు కారణం.
సెప్టెంబర్ 6న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్: ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. విక్రమ్ కుమార్, నిర్మాత: ఎ.మహేష్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











