సాయి సన్నిధిలో ‘షిరిడి సాయి’ షూటింగ్ పూర్తి
నాగార్జున నటిస్తోన్న 'శిరిడిసాయి' చిత్ర చివరి రోజు షూటింగ్ సాయి సన్నిధి అయిన షిరిడీలో గురువారం(జూలై 26) జరుపుకుంది. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అంతకు ముందు బుధవారం హైదరాబాద్‌లో శిరిడీసాయి భారీ హోర్డింగ్‌ను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున కుటుంబ సభ్యులు అమల, అఖిల్, నాగచైతన్యలతో సహా ప్రత్యేక రైలులో చిత్ర బృందం షిరిడీ చేరుకున్నారు.
జూలై 30న హైదరాబాద్‌లో ఆడియో విడుదల కానుంది. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సూపర్ హిట్ భక్తి రస చిత్రాల తర్వాత కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షుల్లో ఈచిత్రంపై మంచి అంచనాలున్నాయి.
శ్రీకాంత్, శరత్ బాబు, సాయికుమార్, శ్రీహరి, షాయాజీ షిండే, డా. బ్రహ్మానందం, అలీ, సంపత్, అనంత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, కమలిని ముఖర్జీ, రోహిణి హట్టంగడి, వినయ్ ప్రసాద్, మజుతా దేశ్ ముఖ్, కౌశిక్, నాగేష్ భోస్లే, దేవేందర్ డాడ్కే, దినకర్ గవండే, దీపాలి డాడ్కే, భవాని, రవిభట్, విజయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి ఎంఎం కీవవాణి సంగీతం అందించారు. ఇందులోని పాటల్ని సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, శ్రీరామ జోగయ్య శాస్త్రి, వేదవ్యాస్, మేడిచర్ల సత్యనారాయణ మూర్తి తదితరులు వ్రాశారు. ఛాయాగ్రహణం : ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్ : శర్వన్, కళ : భాస్కర రాజు, శ్రీకాంత్, కథా సంకల్పం : భక్త సురేష్, కథా సహకారం : పొందూరి హనుమంతరావు, కో డైరెక్టర్ : ఎ.ఎస్. రవీంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. విక్రమ్ కుమార్, నిర్మాత : ఎ. మహేష్ రెడ్డి, సమర్పణ : శ్రీమతి సులోచనారెడ్డి, దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు


Click it and Unblock the Notifications











