నాగార్జున ‘షిరిడి సాయి’ షూటింగ్ డీటేల్స్
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'షిరిడి సాయి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున షిరిడి సాయిబాబా పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్, కర్నాటకలోని బదామిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం కులుమనాలిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ నాగార్జున, ఇతర నటులపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జులై నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు శర వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.
ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి శ్రీసాయి కృప ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కీరవాణి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 9 పాటల రికార్డింగును పూర్తి చేశారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్‌గా పని చేస్తుండగా, ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. భక్త కిషోర్ ఈచిత్రానికి కథ సమకూర్చారు. గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామరాజ్యం చిత్రాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి.
'రాజన్న' సినిమా తర్వాత నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఢమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చోటాకె.నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











