సెల్ ఫోన్ చూస్తే చిర్రెత్తి పోతున్న దర్శకుడు!
ఈ మధ్య సినిమా విడుదల కాకముందే...సదరు సినిమాకు సంబంధించిన సమాచారం, పాటలు, కొన్ని కీలకమైన సీన్లు బయటకు లీకవుతున్న సంగతి తెలిసిందే. ఇదంతా సినిమా యూనిట్ సభ్యుల పనే అనే విషయం గ్రహించిన దర్శక నిర్మాతలు షూటింగ్ స్పాట్లలో సెల్ ఫోన్లు నిషేదించడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ తన తాజా సినిమా 'జోకర్" సినిమా షూటింగులో సెల్ ఫోన్లను నిషేదించాడు. తన మాటను కాదని ఎవరైనా సెల్ ఫోన్ తీసుకుని సెట్ లోకి వస్తే వెర్రెక్కిన కోతిలా వారి మీద పడి రక్కేసినంత పని చేస్తున్నాడట.
ఈ దర్శకుడు ఇంతలా హడావుడి చేయడానికి కారణం ఇటీవల సినిమా సెట్లో షూటింగ్ జరుగుతుండగా యూనిట్ సభ్యుల్లో ఒకరు సెల్ ఫోన్ లో సీన్ చిత్రీకరించడం శిరీష్ కంట పడింది. దీంతో విడుదలకు ముందు సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అందులో భాగంగానే సెల్ ఫోన్లపై నిషేదం. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ చేస్నున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ చిత్రాంగద సింగ్ పై ఐటం సాగ్ చిత్రీకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











