సక్సెస్ అయినా రెమ్యునరేషన్ అందలేదా???

By Staff


కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చందమామ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుని శతదినోత్సవాన్ని కూడా జరుపుకుంది. ఈ శతదినోత్సవం మంగళవారంనాడు నగరంలోని దుర్గం చెరువులో జరిగింది. ఇదంతా బాగానే ఉందికానీ ఈ సినిమాలో నటించిన హీరోలలో ఒకరైన శివబాలాజీకి ఇంకా రెమ్యునరేషన్ అందలేదనే పుకారు షికారు చేస్తోంది.

సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సినిమా నటీనటుల గురించి చాలామంది చాలా కామెంట్లు చేశారు. అదేమంటే ఇందులో నటిస్తున్నవారంతా డల్ ఫేస్ లని. ఈ డల్ ఫేస్ లతో సినిమా నిర్మించి కృష్ణవంశీ ఏంచేస్తాడబ్బా అని చెవులు కొరుక్కున్నారు. కృష్ణవంశీ ఇవేం పట్టించుకోలేదు కానీ ఈ చిత్ర నిర్మాత మాత్రం పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. సినిమా విజయవంతమైతేనే శివబాలాజీకి రెమ్యునరేషన్ ఇద్దామనుకున్నట్టు సమాచారం. అమాయక పల్లెటూరబ్బాయిగా శివబాలాజీ తనవంతు ప్రతిభను కనపరిచాడు. ఈ సినిమాను చూసిన అమ్మాయిలు చాలామంది శివబాలాజీ అంటే మనసు పారేసుకున్నారట. అయినా నిర్మాత మనసు మాత్రం కరగకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X