ఇది మా అశోక్ గ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివబాలాజీ,కుటుంబ కథా చిత్రాల హీరోయిన్ మధుమిత త్వరలో వివాహం చేసుకోనున్నారు. దీనికి సంభందించిన నిశ్చితార్థవేడుక హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం జరిగింది. ఈ సంధర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ ''మేమిద్దరం 'ఇంగ్లిష్‌కారన్' అనే తమిళ చిత్రంలో జంటగా నటించాం. అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య సఖ్యత పెరిగింది. మధుమిత నాకు మంచి భార్యగా ఉంటుందని మా అమ్మ అనుకున్నారు. ఆ విషయాన్నే నాతో చెప్పినప్పుడు సరేనన్నాను. డిసెంబర్‌లోగానీ, జనవరిలో గానీ పెళ్లి ఉంటుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటించే విషయం ఇంకా ఆలోచించలేద''ని చెప్పారు. 'ఆర్య', 'చందమామ' లాంటి చిత్రాలతో పాపులర్ అయిన శివబాలాజీ ప్రస్తుతం ముమైత్ ప్రధాన పాత్రలో చేస్తున్న టార్గెట్ సినిమాలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా చేస్తున్నాడు.