twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘శివ’ మూవీ ఎడిటర్ దయనీయ స్థితి... కొన్నేళ్లుగా ఫుట్‌పాత్ మీదే!

    By Bojja Kumar
    |

    తెలుగు సినిమా చరిత్రలో 'శివ' మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత హీరోగా నాగార్జున, దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఏ సినిమాకైనా ఎడిటింగ్ అనేది ఎంతో కీలకం. శివ సినిమా ఎడిట్ చేసిన విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉండటం కూడా సినిమా బాగా ప్లస్సయింది. అప్పట్లో ఈ సినిమాకు సత్తి బాబు అనే వ్యక్తి ఎడిటర్‌గా పని చేశారు. ఈ సినిమా తర్వాత ఇతగాడి కెరీర్ కూడా ఎక్కడికో వెళ్లిపోయిందని అంతా అనుకుంటారు. కానీ ఇపుడు సత్తిబాబు పరిస్థితి గురించి తెలిస్తే మీరు షాకవుతారు.

     సత్తి బాబును వెతుక్కుంటూ...

    సత్తి బాబును వెతుక్కుంటూ...

    కొన్నేళ్లుగా ఆయన ఉండటానికి ఇళ్లు లేక, అద్దె ఇంట్లో ఉండే స్తోమత లేక ఫుట్ పాత్ మీదనే పడుకుంటున్నారు. సత్తి బాబు పరిస్థితి గురించి తెలుసుకున్న ‘దిక్సూచి' మూవీ నటుడు, దర్శకుడు దిలీప్ కుమార్ అతడిని వెతుక్కుంటూ వెళ్లగా జూబ్లీహిల్స్‌లో ... ఓ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీద అతడు కనిపించాడు.

     ఇతడి పరిస్థితి రామ్ గోపాల్ వర్మకు తెలుసా?

    ఇతడి పరిస్థితి రామ్ గోపాల్ వర్మకు తెలుసా?

    తన పరిస్థితి గురించి రామ్ గోపాల్ వర్మకు తెలుసో తెలియదో అని చెప్పిన సత్తి బాబు... శివ సినిమాకు పని చేసిన ఎవరో ఒకరు కనిపిస్తారని చాలా రోజులు వెయిట్ చేశాను అన్నారు.

    ఎవరినీ సహాయం అడగలేదు

    ఎవరినీ సహాయం అడగలేదు

    గౌతం రాజుతో కలిసి చాలా సినిమాలకు పని చేశాను. అప్రెంటిస్ దగ్గర నుండి ఆయనతో చేశాను. ఇప్పటికీ సినిమాల్లో గౌతమ్ రాజు బిజీగా ఉన్నప్పటికీ నాతో ఆయనకు అవసరం లేదు అని సత్తి బాబు అన్నారు. ఎడిటర్ యూనియన్లో తనకు సభ్యత్వం ఉందని, అయితే నేను ఎప్పుడూ ఎలాంటి సహాయం అడగలేదని తెలిపారు.

    సత్తి బాబుకు సహాయం

    సత్తి బాబుకు సహాయం

    అతడిని తన కారులో ఎక్కించుకని ఇంటికి తీసుకొచ్చిన దిలీప్ కుమార్ పొట్లూరి సత్యనారాయణ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ తరుపున సీత అనే మహాతల్లి అందించిన సహాయంతో అతడికి భోజనం పెట్టిన కొత్త బట్టలు కొనిచ్చారు. ఇకపై మీరు ఫుట్ పాత్ మీద పడుకోవాల్సిన అవసరం లేదంటూ... సత్తి బాబుకు ఉండటానికి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు.

    ఇప్పటి టెక్నాలజీలో శిక్షణ

    25 ఏళ్ల క్రితం ఫిల్మ్ రీల్ ఎడిటింగుకు, ఇప్పటి డిజిటల్ టెక్నాలజీ ఎడిటింగుకు చాలా మార్పులు వచ్చాయి. ఇందులో సత్తిబాబుకు శిక్షణ కూడా ఇప్పించే ఏర్పాట్లు కూడా చేశారు.

    English summary
    Shiva Movie Editor Sathi Babu is homeless now and he is staying on footpath. Actor Dilip helped him through Potluri Satyanarayana Lakshmi charitable trust.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X