Manu Charitra Twitter Review: 'మను చరిత్ర'కు ఊహించని టాక్.. హైలెట్ అంశాలు ఇవే!
శుక్రవారం అంటేనే సినిమాల సందడి. ప్రతి వారం కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చి సినీ ప్రియులను, ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈవారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేవు. కానీ టైటిల్ తో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సినిమా 'మను చరిత్ర' (Manucharitra). బ్యూటిఫుల్ హీరోయిన్ మేఘా ఆకాష్, హుషారు సినిమా ఫేమ్ ప్రియా వడ్లమాని నటించిన ఈ సినిమాతో భరత్ పెదగాని కొత్త దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 23న అంటే ఇవాళ విడుదల కానున్న మను చరిత్ర సినిమాపై పబ్లిక్ స్పందన ఎలా ఉందో చూద్దాం.
నిర్మాతలు ఎవరంటే? : నూతన డైరెక్టర్ భరత్ పెదగాని దర్శకత్వంలో శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'మను చరిత్ర' (Manu Charitra Movie). గ్లామరస్ ముద్దుగుమ్మలు మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాపిల్ ట్రీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎన్. శ్రీనివాస రెడ్డి, రాన్సన్ జోసేఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అవి తొలగించి: మను చరిత్ర సినిమాకు సుందర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ అథిగా హాజరు కావడం, ట్రైలర్ లాంచ్ కు విశ్వక్ సేన్ రావడంతో మను చరిత్రపై కాస్తా బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ (CBFC) ఏకంగా 21 కట్స్ ఇచ్చింది. 13.44 నిమిషాల నిడివిగల సన్నివేశాలను తొలగించాలని చిత్ర నిర్మాతలను ఆదేశించి.. U/A సర్టిఫికేట్ జారీ చేసింది.

ఆడియెన్స్ రియాక్షన్: 170 నిమిషాల రన్ టైమ్ ఉన్న మను చరిత్ర సినిమా జూన్ 23న అంటే ఇవాళ శుక్రవారం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు ముందుగానే పడ్డాయి. ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు మను చరిత్ర సినిమాపై పలు విధాలుగా స్పందించారు.

స్టోరీ బాగుంది: "మను చరిత్ర సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సింపుల్ లైన్. కానీ డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్షన్ బాగా చేశారు. నిడివి ఎక్కువ ఉన్నా స్టోరీ బాగుంది. మంచి కంటెంట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భయపడతారు. సాంగ్స్ లేవు. ఓవరాల్ గా సినిమా సూపర్బ్ గా ఉంది" అని ఒకరు తెలిపారు.

క్లైమాక్స్ అలా: "సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కొన్ని సన్నివేశాలు లాజికల్ గా లేవు. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోయిన్లు ఆకట్టుకున్నారు. బీజీఎమ్ భయపట్టేలా చేస్తుంది. క్లైమాక్స్ పర్వాలేదనిపించింది. స్టోరీ నార్మల్ గా ఉన్నా ఎంగేజింగ్ గా సాగుతుంది" అని మరొకరు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











