రాజ్ కందుకూరి కుమారుడికి వరుస ఆఫర్స్
'పెళ్లి చూపులు' ఫే, నేషనల్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి త్వరలో హీరోగా తెరంగ్రేటం చేయబోతున్నాడు. శేష సింధు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
శివ కందుకూరికి జోడీగా తమిళ చిత్రం '96' ఫేం వర్షా బొల్లమ్మ నటిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవ్వగా ఏప్రిల్‌లో టోటల్ షూటింగ్ ముగియనుంది. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇంకా తొలి చిత్రం పూర్తి కాకముందే శివ తన సెకండ్ ఫిల్మ్ సైన్ చేశాడు. ఫిబ్రవరి 18న తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. యాపిల్ ట్రీ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.
'ఆర్ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి వద్ద అసిస్టెంటుగా పని చేసిన భరత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించబోతున్నారు. శివ మొదటి సినిమా కూడా ఇతడే సంగీతం అందిస్తుండటం గమనర్హం.


Click it and Unblock the Notifications











