ఎస్ఎంఎస్ కలెక్షన్లపై మహేష్ బాబు ప్రభావం
సినిమా సక్సెస్ మీట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ...చిన్న సినిమాగా తాము చేసిన 'ఎస్.ఎం.ఎస్.' విడుదలైన రోజు అన్ని థియేటర్లూ ఫుల్ అవడం అనూహ్యమన్నారు. మావయ్య (కృష్ణ), మహేశ్ వల్ల సినిమాకి అంచనాలు వచ్చాయనీ, వారి అభిమానులు చూపించిన ఆదరం వల్లే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయనీ ఆయనన్నారు. సూపర్‌గుడ్ మూవీస్ అధినేత ఆర్.బి. చౌదరి సమర్పణలో వేగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మించిన 'ఎస్.ఎం.ఎస్.' సినిమా ఇటీవల విడుదలైంది.
తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సుధీర్ మాట్లాడారు. "తొలి మూడు రోజుల్లో మా సినిమాకి మూడు కోట్ల రూపాయలు వసూలు కావడం ఊహించని విషయం. చక్కని ప్రేమకథని అంతే చక్కగా దర్శకుడు సత్య తీర్చిదిద్దినందునే సినిమా మంచి విజయం సాధించింది. వేలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ గురించి చక్కని సందేశాలు పంపినవారికి (నెం.99634483) బహుమతులు అందజేస్తాం'' అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications












