Nagarjuna: ‘ఆ రోజును జీవితంలో మర్చిపోలేను’: నాగార్జున ఎమోషనల్
Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) క్రేజ్ అంతా ఇంతా కాదు. 63 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ యంగ్ హీరోలకే సవాలు విసురుతున్నాడు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీపడుతున్నాడు. పరంగా పుల్ బిజీగా ఉన్నారు. ఇద్దరు కొడుకులు హీరోగా రాణిస్తున్నప్పటికీ నాగ్ ఏమాత్రం తన ఫిట్ నెస్ తో యంగ్ గా కనిపిస్తూ అందరిని అవాక్ చేస్తున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా నాగార్జున ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసున్నారనే సంగతి తెలిసిందే. ఇదెలా ఉంటే.. తాజాగా కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ కామెంట్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబోలో వచ్చిన మూవీ 'శివ'. ఈ మూవీ తెలుగు సినిమాల్లో కల్ట్ స్టేటస్ అందుకుంది. నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ ఇది. 1990లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ మారింది. శివ సినిమాలో నాగార్జున సరసన అమల నటించారు.శివ సినిమాలో రఘువరన్ విలన్ గా నటించగా.. తనికెళ్ల భరణి సైడ్ విలన్ నటించారు.

ఇక జేడీ చక్రవర్తి మరో కీలక పాత్ర పోషించాడు. వీళ్లందరికీ శివ సినిమా బ్రేక్ ఇచ్చింది. ఇళయరాజా సంగీతం, డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియస్ బ్యానర్ పై తెరకెక్కింది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ పేరు మారుమోగిపోయింది. ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశాడు వర్మ. ఇందులో కూడా నాగార్జునే హీరోగా నటించాడు. హిందీలో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది.
ఈ కల్ట్ మూవీ శివ విడుదల అయి 35 ఏళ్లు పూర్తి కావడంతో నాగార్జున ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. 'X' వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు కింగ్ నాగార్జున. 'శివ విడుదలై 35 ఏళ్లు అవుతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా నాన్న కలిసి కారులో ప్రయాణించిన ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను ' అని పేర్కొన్నారు.

'నిన్న రాత్రి శివ సినిమా చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అని విన్నాను. టాలీవుడ్ లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను'అని నాన్న నాతో అన్నారు. 'నిజంగా అద్భుతం నాన్నా... ఆనాడు నీ మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్లు తర్వాత కూడా శివ సినిమాను అభిమానిస్తున్న వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను'అని రాసుకొచ్చారు. శివ సినిమా రూపొందడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ... ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
కింగ్ నాగార్జున ఈ ట్వీట్ పై దర్శకుడు ఆర్జీవీ స్పందిస్తూ.. 'లైఫ్ టైమ్ గుర్తుండిపోయే బ్రేక్ ఇచ్చినందుకు థాంక్స్. మీ అమితమైన నమ్మకం, సపోర్ట్ లేకపోతే 'శివ' నేను ఉండేవాళ్లం కాదు'' అని ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











