విజయ్ దేవరకొండతో మూవీ క్యాన్సిల్.. తప్పుడు వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తప్పకుండా ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని టాక్ అయితే గట్టిగానే వస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఆలోచనతో లోకల్ సినిమాలను వదులుకుంటున్నాడని కూడా టాక్ వచ్చింది. ఇక గత ఏడాది ఒక యివ దర్శకుడితో సినిమాకు కమిట్ అయిన విజయ్ ఇప్పుడు రిజెక్ట్ చేయడంతో ఆ దర్శకుడు మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ దర్శకుడు సోషల్ మీడియా ద్వారా రూమర్స్ కు ఒక క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

పుష్ప తరహాలో..
విజయ్ దేవరకొండకు నార్త్ లో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇదివరకే అతని కొన్ని తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలు కూడా హిందీలో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకోవడం విశేషం. చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప తరహాలోనే లైగర్ సినిమా కూడా మెల్లగా నార్త్ జనాలను ఆకట్టుకునే విధంగా సక్సెస్ కావచ్చని కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

హిట్ కాకపోయినప్పటికీ..
పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే ఈ దర్శకుడు హిందీలో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోయినప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతాడు.

క్యాన్సిల్ చేసే ఆలోచనలో..
అయితే లైగర్ సినిమా కంటే ముందుగానే విజయ్ దేవరకొండ ఓకే చేసిన కొన్ని ప్రాజెక్టులను ఇప్పుడు క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే ఈ సినిమా తరువాత ఎక్కువగా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాలు చేస్తాడు అని అందుకోసమే లోకల్ కథలకు ఓకే చెప్పడం లేదు అని టాక్ వస్తోంది.

ఎలాంటి నిజం లేదని
విజయ్ దేవరకొండ పై ప్రస్తుతం వస్తున్న రూమర్స్ అయితే అబద్ధాలు అని కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇటీవల ఒక దర్శకుడు తనతో సినిమా క్యాన్సిల్ అయినట్లు వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేయడంతో ఆ దర్శకుడు మరో హీరోను వెతుకుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా వివరణ ఇచ్చేశారు.

ఫేక్ న్యూస్ అంటూ..
విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ అయితే ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి రాబోతోంది. అయితే విజయ్ దేవరకొండ మళ్ళీ ఇప్పుడు రిజెక్ట్ చేయడంతో ఆ దర్శకుడు వెంకటేష్ ను హీరోగా పెట్టి అదే కథను తెర పైకి తీసుకు రాబోతున్నట్లు రూమర్స్ రావడంతో అందులో ఎలాంటి నిజం లేదని ఫేక్ న్యూస్ అంటూ శివ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

విజయ్ చేయబోయే సినిమాలు..
శివ నిర్వాణ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తప్పకుండా ఒక సినిమా ఉంటుంది అని ఈ వార్తతో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే రౌడీ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ర్యాంపేజ్ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లుగా ఇటీవల విజయ్ దేవరకొండ ఒక హీంట్ అయితే ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రాజెక్టును ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











