చైతూని కౌగిలించుకుని ఏడవకపోతే నన్ను అడగండి.. సమంతని తీసుకుంది అందుకు కాదు!
వివాహం తర్వాత తొలిసారి సమంత, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో వీరిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో రూపొందుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఆదివారం రోజు మజిలీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీరిలీజ్ వేడుకకు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ చిత్రం గురించి మాట్లాడుతూ నాగ చైతన్య, సమంత పాత్రల గురించి వివరించాడు.

నిన్నుకోరి తర్వాత
శివ నిర్వాణ మాట్లాడుతూ.. నిన్నుకోరి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. తదుపరి చిత్రం ఏ జోనర్ లో చేయాలని అని ఆలోచిస్తున్న సమయంలో నాగ చైతన్య ఫోన్ చేశారు. నిన్నుకోరి నాకు బాగా నచ్చింది. నాకు సరిపడే కథ ఏదైనా ఉంటే తీసుకురా అని అడిగారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. కొన్ని రోజుల తర్వాత పూర్ణ పాత్రకు సంబంధించిన ఐడియా వచ్చింది. ఆ పాత్రలో నాగ చైతన్యనే ఊహించుకున్నా. చాలా బలమైన పాత్ర అది. వెంటనే నాగ చైతన్యని కలసి నాకు వచ్చిన ఐడియా వివరించానని శివ తెలిపారు.

సమంత మాత్రమే భరించగలదు
పూర్ణ పాత్రలో నాగ చైతన్యని భరించాలంటే అద్భుతంగా నటించే హీరోయిన్ కావాలి. ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తున్న సమయంలో సమంతని ఎంపిక చేసుకున్నట్లు శివ తెలిపారు. వారిద్దరూ ప్రాణం పెట్టి నటించారని శివ ప్రశంసించారు. ఇది కేవలం టైం పాస్ కోసం చూసే చిత్రం కాదని, ప్రతి ఒక్కరు కథలో ఇన్వాల్వ్ అవుతారని శివ తెలిపాడు.

ఇమేజ్ వాడుకుందామని కాదు
సమంత, చైతు భార్యాభర్తలు. వీరిద్దరూ కలసి నటిస్తే సినిమాకు మంచి మార్కెట్ వస్తుంది. కానీ తాను అందుకోసం ఈ చిత్రంలో సమంతని హీరోయిన్ గా ఎంపిక చేసుకోలేదు. సమంత ఎంత అద్భుతంగా నటించగలదో తెలిసే తీసుకున్నానని శివ తెలిపారు. సమంత, నాగ చైతన్య పాత్రలు ఈ చిత్రానికి మూలస్తంభాలు లాంటివి అని అన్నారు.

చైతూని కౌగలించుకుని
ఈ చిత్రంలో నాగ చైతన్య నటన గురించి మాట్లాడుతూ శివ ఒకరకంగా ఆడియన్స్ కు సవాల్ విసిరారు. ఈ చిత్రం చూసిన తర్వాత నాగ చైతన్య ఎక్కడైనా కనిపిస్తే గట్టిగా కౌంగించుకుని ఏడవకపోతే నన్ను అడగండి అని శివ అన్నారు. ఐపీఎల్, ఎలక్షన్స్ ఎన్ని ఉన్నా మజిలీ చిత్రం మంచి కిక్కు ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 5న మజిలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











