నన్ను ఆ ఆర్టిస్టు తొక్కేసాడు...మిమిక్రీ శివారెడ్డి ఆవేదన
నన్ను తొక్కేస్తున్నది ఒక్కరే. మంచి క్యారెక్టర్లు రాకుండా మాత్రం అడ్డుకుంటున్నాడు. అదీ తన కాంబినేషన్‌లో వచ్చినప్పుడు. అయితే, ఎవరు ఎలాంటి వారో అందరికీ అర్థం అవుతుంది అని భావిస్తున్నాను అన్నారు నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి. ఆయన ఆదివారం రాత్రం ఓ టీవీ ఛానెల్ తో ఇంటర్వూ ఇస్తూ తనకు ఆఫర్స్ రాకపోవటంపై ఇలా స్పందించారు. అయితే ఆ తొక్కేసేవాడి పేరు మాత్రం చెప్పటానికి ఇష్టపడకుండా...ఎందుకు లెండి... ఇప్పటికే సినిమాలు తగ్గాయి. పూర్తిగా అవకాశాలు పోతాయి. అవకాశం వచ్చినప్పుడు చెబుతాను అన్నారు.
ఇక తనపై చేస్తున్న దుష్పచారం గురించి చెబుతూ...నేను అమెరికాలో ఎక్కువ ప్రదర్శనలు ఇస్తుండటంతో శివారెడ్డి అమెరికాలోనే ఉంటాడు అని ప్రచారం చేశారు. ఆ కారణంగా సినిమా అవకాశాలు చాలా తగ్గాయి. మొదట్లో నాపై వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు చాలా బాధ పడ్డాను. ఏడ్చాను కూడా. ఆయన కాళ్లపై పడి నేనేం తప్పు చేశానని అడిగాను అన్నారు. ఆయన రీసెంట్ గా జై బోలో తెలంగాణ చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











