విక్రమ్-అనుష్క ‘శివతాండవం’ ఆడియో డేట్
హైదరాబాద్ : విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న తమిళ చిత్రం 'తాండవం'. ఈ చిత్రానికి తెలుగులో 'శివ తాండవం' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
తాజాగా ఈచిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 11న ఈచిత్రం ఆడియో విడుదల చేసి...ఇదే నెల 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తెలుగులో విక్రమ్‌కు మంచి క్రేజ్ ఉన్నందున ఆడియో విడుదల కార్యక్రమంతో పాటు రిలీజ్‌ను గ్రాండ్‌గా చేయబోతున్నారు.
ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు.
లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ఇతన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాల్ని లండన్‌లో చిత్రీకరించారు. తెలుగులో ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ రైట్స్ నిర్మాత సి.కల్యాణ్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications











