సెక్సెవల్ పర్వర్టెడ్ అంటూ హీరో శివాజి ఫైరింగ్
ఆ పూల్ మూలంగానే మా సినిమా ఆగిపోయింది.అయినా అలాంటి సెక్సవల్ పర్వర్టెడ్ పై ఎవరు సినిమా చేస్తారంటూ హీరో శివాజి ఫైర్ అయిపోయారు. ఇంతకీ శివాజి చేత అంతలా తిట్టించుకున్న పెద్ద మనిషి ఎవరూ అంటే సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్న నిత్యానంద. ఆయన గెటెప్ ని అనుకరిస్తూ అయ్యారే అనే చిత్రం తయారైంది.అందులో శివాజీ,రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు.అయితే నిత్యానంద ఆ సినిమా ఆపేయ్యమంటూ కోర్టు కెక్కారు. దాంతో సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని అయ్యారే ఆడియో ఫంక్షన్ లో ప్రస్దావిస్తూ శివాజి ఇలా ఇండైరక్ట్ గా చెలరేగిపోయాడు.
ఇక రాజేంద్ర ప్రసాద్ ఇదే మ్యాటర్ పై మాట్లాడుతూ . అయ్యారే నిత్యానంద స్టోరీ అని ప్రచారం చేస్తున్నారని అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఓ ఏటిఎం సెంటర్ దగ్గరగా సెక్యూరిటీ గార్డుగా ఉన్న వ్యక్తి స్వామిగా ఎలా మారాడు అని చెప్పామని అన్నారు. స్వామిగా ఎలా ఎదిగాడు, ఎందుకు ఎదిగాడని చెప్పామని అన్నారు.సినిమా కేవలం నవ్వించడానికి, ప్రజలను చైతన్యపర్చడానికే సినిమా తీశామని చెప్పారు.


Click it and Unblock the Notifications











