సెప్టెంబర్లో శివాజీ ‘గోల గోల’
ఈ సినిమా ప్రధాన లక్ష్యం ప్రేక్షకులను నవ్వించడమే. రెండున్నర గంటల పాటు సరదాగా సాగిపోయే విధంగా సినిమా ఉంటుంది. రవివర్మ స్వరాలను అందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఓ మంచి సినిమాగా ఇది నిలుస్తుంది అని హీరో శివాజీ అంటున్నారు.
దర్శకుడు శ్యాం మాట్లాడుతూ- పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా రూపొందిన ఇందులో ఓ ఛానెల్ ప్రోగ్రాం డైరెక్టర్‌గా శివాజీ నటన సరికొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్ర చిత్రానికి హైలైట్ అనీ, రవివర్మ స్వరపరచిన నాలుగు పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ నెల 7న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
జ్యోతి, సత్యం రాజేష్, చిత్రం శీను, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, రామ్‌జగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: రాజా చంద్రవర్మ, స్క్రీన్‌ప్లే: వై.ఆర్.సి. కెమెరా: బి.వాసు, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాతలు: వై.రాణి, విక్రమ్‌రాజ్, దర్శకత్వం: శ్యాం.


Click it and Unblock the Notifications












