హీరో శివాజీ కొత్త చిత్రం డీటేల్స్

By Bojja Kumar

ఒకటి, రెండు తప్ప కెరీర్లో పెద్దగా హిట్లు అనేవే లేని హీరో శివాజీ త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాజీ హీరోగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రీతూకౌర్ హీరోయిన్ గా ఎంపికైంది. శ్రీలక్ష్మి నరసింహ అంజిత ఫిలింస్-ఆర్ఆర్ రియల్టర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనందరావు, కె.జె దశరత్, అమరనాథ్ రెడ్డి సహ నిర్మాతలుగా కాగా, కృష్ణ, డిఆర్ రెడ్డిలు నిర్మాతలు. ఇంకా టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది.

ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 18 మంది ప్రముఖ హాస్య నటులతో పూర్తి స్థాయి వినోద భరితంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు మనోహర్ చిమ్మని చెప్పుకొచ్చారు. శివాజీ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం టేకింగ్ చాలా కొత్తగా, విభిన్నంగా ఉంటుందని చెప్పారు. దొంగలబండి చిత్రానికి సంగీతం అందించిన స్వరాజ్ హెడిడె ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఐటం సాంగుతో మొత్తం ఐదు పాటలు ప్లాన్ చేశారు.

సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రంలో హంగామా ఫేం జ్యోతి, అల్లరి ఫేం సుభాషిణి, మహేశ్వరి, చిత్రం శ్రీను, తాగుబోతు రమేష్, ఆర్.కె, ధన్ రాజ్, పృథ్వీరాజ్, సూర్య, లాప్ టాప్ తడివేలు, టార్జాన్, చరణ్, షాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : జగదీష్, ఆర్ట్ : విజయకృష్ణ, ఫైట్స్ : బాచి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X