ఆడపిల్లలతో కబాడి ఆడుతున్న శివాజి
ఈ చిత్రం నిర్మాత కె.సురేష్‌బాబు మాట్లాడుతూ "మంచి చిత్రాలు నిర్మించాలన్న ఆశయంతో శ్రీ శివపార్వతి కంబైన్స్‌ను ప్రారంభించాం. మా తొలి చిత్రం 'నాకూ ఓ లవరుంది' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు కబడ్డీ నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన కథతో రెండో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది చెప్పిన కథ బాగా నచ్చింది. స్ఫూర్తిని పంచేలా ఉంది. శివాజీగారు కూడా వెంటనే ఒప్పుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నాం. చిన్నిచరణ్ సంగీత సారథ్యంలో పాటల రికార్డింగ్ చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ "గతంలో కబడ్డీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కబడ్డీ ప్లేయర్స్‌గా మా చిత్రంలో అమ్మాయిలు కనిపిస్తారు. అన్ని రకాల భావోద్వేగాలు కలగలిసిన చిత్రంగా తెరకెక్కిస్తాం. ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్స్‌ని సెలక్ట్ చేసి రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తాం. మంచి చిత్రంగా నిలుస్తుంది'' అని అన్నారు.
జూన్ 15న సినిమాను ప్రారంభిస్తారు. కనిగిరి, భైరవకోన, త్రిపురాంతకం, పెద ఎర్లపాడు వంటి ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్స్ అయిన అమ్మాయిలను ఈ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారు. 70 మంది పాత, కొత్త నటీనటులు ఇందులో నటిస్తారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: యస్.మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: చిన్నిచరణ్, సహ నిర్మాతలు: సి.హెచ్.మల్లికార్జున్ రెడ్డి, పెద్దిరెడ్డి గోవిందరెడ్డి, నిర్మాత: కె.సురేష్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నరసింహ నంది.


Click it and Unblock the Notifications












