కుట్ర వల్లే ఓడిపోయా, దమ్ముంటే మహేష్ బాబుతో రూ. 2 కోట్లు తెండి: శివాజీ రాజా సవాల్

Recommended Video

Shivaji Raja Press Meet : Shivaji Raja Controversial Comments On Jeevitha Rajasekhar | Filmibeat

'మా' ఎన్నికల్లో ప్రెసిడెంటుగా గెలిచిన తర్వాత నరేష్ మీడియా ముందు వచ్చి మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నరేష్ తీరు చూసిన కొందరు ఆయన శివాజీరాజాకు వార్నింగ్ ఇచ్చినట్లు ఉందని చర్చించుకున్నారు. ఈ పరిణామాలపై శివాజీ రాజా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు.

దీంతో పాటు మహేష్ బాబుతో చేయాలనుకున్న ప్రోగ్రాం గురించి, అది ఎందుకు కేన్సిల్ అయిందో వెల్లడిస్తూ... కొత్తగా ఎన్నికైన నరేష్‌కు సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో శివాజీ రాజా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఇప్పుడే ఇలా ఉంటే ఎలా?

ఇప్పుడే ఇలా ఉంటే ఎలా?

నేను గతంలో ‘మా' ఎన్నికల్లో పెద్ద పెద్ద వారిపై నెగ్గాను. ఎప్పుడూ తల ఎగరేయలేదు. ఏం చెప్పానో అవి చేసుకుంటూ వెళ్లాతాను, వాటి గురించే మాట్లాడతాను. అంతే కానీ ఎవరికీ వార్నింగులు ఇవ్వలేదు. వార్నింగులు ఇవ్వడానికి మనం ఏమైనా దేశానికి ప్రధాన మంత్రులుగా పదవి చేపట్టమా? పదవి వస్తే అణకువగా ఉండాలి. అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఏం చేస్తారో? అని శివాజీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు.

దమ్ముంటే మహేష్ బాబు ద్వారా రూ. 2 కోట్లు తెండి

దమ్ముంటే మహేష్ బాబు ద్వారా రూ. 2 కోట్లు తెండి

గతంలో మహేష్ బాబు దగ్గరకు వెళితే ప్రోగ్రాం చేస్తామన్నారు. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. రావాల్సిన 2 కోట్లు రాలేదు. తర్వాత చిరంజీవిగారి దగ్గరకు వెళ్లి మహేష్ బాబు గారితో ప్రోగ్రాం చేస్తాను అని నరేష్ చెప్పారు. నాలుగు నెలలైనా ప్రోగ్రాం చేయలేదు. మీడియా ఎదురుగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంకో మూడు నెలల సమయం ఇస్తా. మహేష్ బాబును అమెరికా తీసుకెళతారో మరో దేశానికి వెళ్లి కార్యక్రమం చేస్తారో మీ ఇష్టం... రూ. 2 కోట్లు ‘మా'కు తీసుకురండి. అపుడు నేనే వచ్చి శబాష్ అని మీకు దండవేస్తా... అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

అందుకే ఓడా, కుట్రలో బలయ్యా

అందుకే ఓడా, కుట్రలో బలయ్యా

నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓల్డేజ్ హోమ్ కట్టిస్తానని చెప్పడమే. నా లాంటి లేనోడు.. భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ఓల్డేజ్ హోం, ‘మా' బిల్డింగ్ కట్టేస్తే పేరంతా వీడికే వచ్చేస్తుంది... ఇక మా సంగతి ఏమిటి? అని కొందరు పన్నిన కుట్రలో బలయ్యామని శివాజీ రాజా తెలిపారు.

‘మా' బిల్డింగ్, ఓల్డేజ్ హోం ఎవరు కడితే వారే హీరో

‘మా' బిల్డింగ్, ఓల్డేజ్ హోం ఎవరు కడితే వారే హీరో

నాకు ఈ పేరు వద్దు ఏమీ వద్దు. ఎవరు ‘మా' బిల్డింగ్, ఓల్డేజ్ హోం ఎవరు కడితే వారే హీరో. మీరే కట్టండి. అది మంచి పని, పది మందికి పనికొచ్చేది. ఎవరు కడితే ఏముంది? అది శివాజీ రాజా చేసిన, మరెవరు చేసినా ఒకటే. ‘మా'లో సభ్యులుగా ఉన్న పేద ఆర్టిస్టులకు న్యాయం జరుగాలని మాత్రమే నేను కోరుకుంటాను... అని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X