twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు ఓటమి... ‘మా’జీ ప్రెసిడెంట్ శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ ఎఫెక్టేనా?

    |

    Recommended Video

    Actor Shivaji Raja Effect On Nagababu Defeat || Filmibeat Telugu

    జనసేన పార్టీ నుంచి నరసాపూర్ ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నాగబాబు ఓటమి ఎవరికి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో తెలియదు కానీ... ఒక వ్యక్తి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పక తప్పదు. అతడే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా.

    'మా' ఎన్నికల్లో తనను ఓటించడానికి నాగబాబు రాత్రికి రాత్రే చేసిన ప్రయత్నాలతో తీవ్ర మనస్తాపికి గురైన శివాజీ రాజా.... తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లే భీమవరం వెళ్లి నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. శివాజీ రాజా చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు.

    నాగబాబుకు ఎన్ని ఓట్లతో ఓడిపోయారంటే?

    నాగబాబుకు ఎన్ని ఓట్లతో ఓడిపోయారంటే?

    ఈ ఎన్నికల్లో నాగబాబు దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మొత్తం పోలైన ఓట్లలో రాఘురామకృష్ణ రాజుకుకు 447594(38.11%), టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 415685(35.39%), నాగబాబుకు 250289 (21.31%) ఓట్లు పోలయ్యాయి.

    నాగబాబుకు ఓటేస్తే నష్టపోతామని నొక్కి చెప్పిన శివాజీ రాజా

    నాగబాబుకు ఓటేస్తే నష్టపోతామని నొక్కి చెప్పిన శివాజీ రాజా

    మా తాత ముత్తాతల కాలం నుంచి మేమంతా భీమవరంలోనే పుట్టాం. నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా నరసాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను, నాగబాబు లాంటి వ్యక్తులకు ఓటేస్తే నష్టపోతాం అంటూ శివాజీ రాజా ప్రచారం చేశారు. శివాజీ రాజా ప్రచారం నరసాపురం ప్రజలపై భాగా ప్రభావం చూపిందని స్పష్టమవుతోంది.

    నరసాపురం ప్రజులు శివాజీ రాజా చెప్పిన ఆ విషయం నమ్మారా?

    నరసాపురం ప్రజులు శివాజీ రాజా చెప్పిన ఆ విషయం నమ్మారా?

    గతంలో నాగబాబు ‘మా' అధ్యక్షుడిగా పని చేసినపుడు 600 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడిగా నిధులు తేవడం సంగతి అటుంచితే ఉన్న నిధులను ఖాళీ చేశాడు. 2 సంవత్సరాలు పదవిలో ఉండి... అసోసియేషన్‌ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం ఎంపీ అయితే లక్షల మందిని ఎలా బాగు చేస్తాడు? అని ప్రశ్న శివాజీ రాజా తెరపైకి తెచ్చారు. ఈ అంశం కూడా ఓటింగుపై ప్రభావం చూపినట్లుగా చర్చించుకుంటున్నారు.

    శివాజీ రాజా పంతం నెగ్గించుకున్నాడు

    శివాజీ రాజా పంతం నెగ్గించుకున్నాడు

    మా భీమవరంలో నాగబాబు కులం అనే పదం ఉపయోగించాడు. చెప్పుతో కొడతా అన్నాడు, తాటతీస్తా అన్నాడు. ఒక రాజకీయ నాయకుడు అలాంటి పదాలు వాడటం తప్పు. ‘నాగబాబు ఇలాగే మాట్లాడితే అన్ని కులాలు కలిసి ఆయన్ను ఊరి చివరి వరకు తరిమి కొడతారు అని శివాజీ రాజా అప్పట్లో వ్యాఖ్యానించారు. నాగబాబు ఓటమికి కారణమైన అంశాల్లో శివాజీ రాజా వివాదం కూడా ఒకటిగా నిలిచిందని స్పష్టమవుతోంది. శివాజీ రాజా పంతం నెగ్గినట్లయింది.

    English summary
    MAA ex president and Actor Shivaji Raja effect on Nagababu defeat. Naga Babu had contested for Narsapur Lok Sabha seat on Jana Sena ticket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X