నరేష్‌తో మనస్పర్ధలున్నాయి.. అవకతవకలు లేవు.. శివాజీరాజా
Recommended Video

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరిగిన అవకతవకలపై సంస్థ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వివాదానికి కేంద్రంగా మారింది. ఆ వివాదంపై వివరణ ఇవ్వడానికి శనివారం (మా) ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, నరేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని చెప్పడంతో గందరగోళంగా మారింది
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ను ముందుకు తీసుకుపోవాలన్న ప్రయత్నంలో నరేష్‌తో మనస్పర్ధలు ఉన్నాయి. వాటిని తొలగించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. నరేష్ చేసిన ఆరోపణల నేపథ్యంలో మా అకౌంట్లను పెద్దల ముందు పెట్టాం. సినీ పెద్దలు నాకో లేదా నరేష్‌కో బంధువులు కాదు అని మా అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు.

మా సంస్థ అకౌంట్ పుస్తకాలను పరిశీలించిన అనంతరం మా పెద్దలు అవకతవకలు లేవని తేల్చారు. దాంతో ఈ వివాదానికి తెరపడింది. భవిష్యత్‌లో మహేష్ బాబు, ప్రభాస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తాం. పేదలకు, సినీ పరిశ్రమకు మేలు చేయడమే మా సంస్థ ఉద్దేశం అని శివాజీరాజా తెలిపారు.
మీడియా సమావేశం అనంతరం మా అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని ఫొటోలకు ఫోజిచ్చారు.
మా భవన నిర్మాణం ఎప్పుడని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సినీ పరిశ్రమపై మీకు పూర్తిగా నాలెడ్జ్ లేదు అని నిర్మాత సురేష్ అనడం గమనార్హం.


Click it and Unblock the Notifications











