twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200 మంది ‘మా’ సభ్యులకు మందు కొట్టించారు.. ఈ నిజం హీరో రాజశేఖరే చెప్పాలి!

    |

    'మా' ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన శివాజీ రాజా... నరేష్, జీవిత తనపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. పదవిలో ఉన్నపుడు ఒకలా, పదవి లేనపుడు ఒకలా ఉండే రకం నేను కాదు.. శివాజీ రాజా ఎప్పుడూ శివాజీ రాజాలాగే ఉంటాడని స్పష్టం చేశారు.

    నాకు డ్యుయెల్ మైండ్ లేదు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం మాత్రమే తెలుసు. పదవిలో లేక పోయినా ఈ పనులు చేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే తాను ఓడి పోయి ఉండొచ్చేమో అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు శివాజీ రాజా సమాధానం ఇచ్చారు.

    నేను రూల్స్ బ్రేక్ చేయలేదు

    నేను రూల్స్ బ్రేక్ చేయలేదు

    వారు నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతి ఛానల్‌కు తిరిగారు. మేము తిరగక పోవడానికి కారణం ‘ ఛానల్‌కు వెళ్లకూడదు, ఇంకొకరి మీద దుమ్మెత్తి పోయకూడదు, అబద్దాలు మాట్లాడకూడదు' అని రూల్ ఉంది. వాళ్లు బ్రేక్ చేశారు, నేను బ్రేక్ చేయలేదు. నా ఓటమికి అది కూడా ఓ కారణమే. నేను జెన్యూన్‌గా ఉన్నాను... అని శివాజీ రాజా తెలిపారు.

    ఇది అన్యాయమైన ఆరోపణ

    ఇది అన్యాయమైన ఆరోపణ

    ఎలక్షన్ జరుగుతున్న రోజు నేను పైన ఆఫీసులో ఉన్నాను. వాళ్లు కిందకి పరుగెత్తుకొచ్చి ఈ అన్యాయం చూశారా, అక్రమం చూశారా? కృష్ణగారు, విజయ నిర్మలగారు లిఫ్టులో ఉంటే శివాజీ రాజా కరెంట్ ఆపేశాడు అంటూ ఆరోపించారు. ఇది ఎంత అన్యాయమైన అబద్దం. అక్కడ నా పేరు చెప్పక పోయినా వారి టార్గెట్ నేనే. నేను డబ్బులు పంచుతున్నట్లు కూడా ప్రచారం చేశారని... శివాజీ రాజా తెలిపారు.

    200 మందికి మందు కొట్టించారు

    200 మందికి మందు కొట్టించారు

    మీరు(నరేష్) దసపల్లా హోటల్‌కు 200 మంది సభ్యులను తీసుకెళ్లి మందు కొట్టించి, భోజనాలు పెట్టారా? లేదా?... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ లేదు. ఇది జరుగలేదని డాక్టర్ రాజశేఖక్ మాత్రమే చెప్పాలి. ఆయన మాట మాత్రమే నేను నమ్ముతా. లోపల ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్లు చెబుతాడు. ఇక నుంచి జీవితకు, నరేష్‌కు అతడిని కంట్రోల్ చేయడానికే సరిపోతుందని... శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

    ప్రెసిడెంటుకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా

    ప్రెసిడెంటుకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా

    నేను డబ్బులు పంచాను అని మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి ఈ మాట చెబుతున్నాను. మందు కొట్టించడం ప్రలోభ పెట్టడం కాదా? ఇలాంటివి నేర్పిస్తే.. ఎంపి ఎలక్షన్లకు కోట్లు ఖర్చు పెట్టినట్లు రేపు ‘మా' ఎన్నికలకు కోట్లు పెట్టాలి. ప్రమాణ స్వీకారానికి పిలిస్తే తప్పకుండా వెళతాను. దానికి వెళ్లినా వెళ్లక పోయినా 1వ తారీఖు నరేష్‌ను ప్రెసిడెంట్ సీట్లో కూర్చోపెట్టడానికి మాత్రం తప్పకుండా వెళతాను. ప్రెసిడెంటుకు ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తానని శివాజీ రాజా తెలిపారు.

    English summary
    MAA ex president Shivaji Raja Sensational Comments On Naresh and Rajasekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X