‘ఏమైనా జరుగొచ్చు’.... శివాజీ రాజా కొడుకు హీరోగా ఎంట్రీ!

By Bojja Kumar

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో నటవారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'మా అధ్య‌క్షుడు, న‌టులు శివాజీరాజా త‌న‌యుడు విజాయ్ రాజాను హీరోగా ప‌రిచ‌య‌ం చేస్తూ ఏదైనా జ‌ర‌గొచ్చు అనే సినిమా బుధవారం అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. కె.రమాకాంత్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెట్ బ్రెయిన్ ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా... ర‌విరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Shivaji Raja Son Vijay Raja Debut Movie Edaina Jarogochu Launch

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ...32 ఏళ్లుగా న‌టుడుగా నన్ను ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌ర‌ణ , ప్రేమ మా అబ్బాయ విజ‌య్ రాజాకు కూడా అందించాల‌ని కోరుకుంటున్నా. స‌త్యానంద్ గారి ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. వాడికి నేను ఒకటే చెప్పాను.... నీకు ఎలా అనిపిస్తే అలా చేయి.. చిరంజీవిగారిలా క‌ష్ట‌ప‌డు. ఆయ‌న‌లా సేవాగుణం క‌లిగి ఉండని చెప్పాను' అన్నారు.

ద‌ర్శ‌కుడు కె. ర‌మాకాంత్ మాట్లాడుతూ...ఏదైనా జ‌ర‌గొచ్చు' హ‌ర్ర‌ర్ జానర్‌లో సాగే కామెడీ థ్రిల్ల‌ర్. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను. ఇంతకు ముందు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వం శాఖలో పని చేశానని తెలిపారు.

Shivaji Raja Son Vijay Raja Debut Movie Edaina Jarogochu Launch

హీరో విజ‌య్ రాజా మాట్లాడుతూ...నేను హీరో అవ‌డానికి అమ్మా నాన్న‌ల స‌పోర్ట్ తో పాటు మావ‌య్య స‌పోర్ట్ ఎంతో ఉంది. నాన్న గ‌ర్వ‌ప‌డేలా చేస్తానన్న న‌మ్మ‌కంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా. ఈ అవ‌కాశం కల్పించిన వెట్ బ్రెయిన్ సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.

Shivaji Raja Son Vijay Raja Debut Movie Edaina Jarogochu Launch

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ప్ర‌కాష్ అన్నంరెడ్డి మాట్లాడుతూ...సీనియ‌ర్ ఆర్టిస్టులు చాలా మంది న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతంః శ్రీకాంత్ పెండ్యాల‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః చిన్నా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విజ‌య్ ప్ర‌కాష్ అన్నంరెడ్డి; ప్రొడ్యూస‌ర్ః వెట్ బ్రెయిన్ ఎంట‌ర్ టైన్ మెంట్; ద‌ర్శ‌కుడుః కె.ర‌మాకాంత్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X