నవ్వుల లడ్డు (ఏం బాబూ లడ్డూ కావాలా..! ప్రివ్యూ )
హైదరాబాద్ : శివాజీ,అదితి అగర్వాల్ హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'ఏం బాబూ లడ్డూ కావాలా!'. గాంధీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదల అవుతోంది. టి.జనార్ధన్, శ్రీ వనిత నిర్మాతలు. డ్రీమ్‌లెైన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది.
కథ ప్రకారం ...వ్యాపారం చేయడంలో చాలా చురుకైనవాడు వంశీ (శివాజీ). ఓ టీవీ షోరూమ్‌ని నిర్వహిస్తుంటాడు. ఆయన భార్య గీత (ఆదితి). వారి సంసారం ఆనందంగా సాగుతూ ఉంటుంది. ఇంతలో నందిని (రచనామౌర్య) అనే ఓ యువతి వీరి మధ్యకు వచ్చి చేరుతుంది. ఆమె రాకతో భార్యాభర్తల మధ్య ఎలాంటి అపోహలు ఏర్పడ్డాయి? డబ్బు కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడే నందినిని ఆ జంట మధ్యకు పంపించింది ఎవరు? రాంబాబు (చిత్రం శ్రీను) అనే వ్యక్తికీ, వీళ్ల కథకీ మధ్య సంబంధమేమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''అనుమానమే పలు అనర్థాలకు మూలం... అనే విషయాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాం. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది'' అన్నారు. హీరో శివాజీ మాట్లాడుతూ "ఇలాంటి సినిమాని ఈవీవీ సత్యనారాయణ తీస్తే వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది. గాంధీ కూడా ఆ తరహాలోనే చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందనే ఫీలింగ్ ఉంది. శ్రీలేఖతో ఇది నాకు ఎనిమిదో సినిమా. భాస్కరభట్ల చాలా చక్కని పాటలు రాశారు. అందుకే ఆడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ...''టైటిల్‌కి తగ్గట్టే పూర్తి వినోదాన్ని పంచే చిత్రమిది. కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఐదు పాటలు వేటికవే ప్రత్యేకం.ఆడియో 'ఆదిత్య' ద్వారా మార్కెట్లోకి రిలీజెై విజయం సాధించింది. సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది లడ్డు అంత తియ్యగా ఉంటుంది. మా దర్శకుడు గాంధీమనోహర్ వినోదభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు '' అన్నారు.
సంస్థ: వనితాస్ డ్రీమ్ లైన్
నటీనటులు: శివాజీ, ఆదితి అగర్వాల్, రచనామౌర్య, చిత్రం శ్రీను, ఏవీయస్, ఎమ్మెస్ నారాయణ, జీవా, రాంజగన్, భావన, సుభాషిణి తదితరులు.
ఛాయాగ్రహణం: బి. వాసు,
కూర్పు: వి. నాగిరెడ్డి,
కళ: విజయ్‌కృష్ణ,
నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్,
సమర్పణ: వనిత,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గాంధీ మనోహర్
నిర్మాత: జనార్ధన్.టి.
విడుదల: 21 సెప్టెంబర్ 2012


Click it and Unblock the Notifications











