హాట్ హాట్‌గా జీవితరాజశేఖర్ కూతుళ్లు.. బికినీ వేసి ఫుల్ ఎంజాయ్!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితరాజశేఖర్ కూతుళ్లు. దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయాలి? ఎక్కడికి వెకేషన్ వెళ్ళాలి? అని ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లారు కూడా. ఇదే బాటలో జీవితరాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

వెకేషన్ టూర్.. కొత్త సంవత్సర సంబరం
జీవితరాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా సింగపూర్ వెళ్లారు. కొత్త సంవత్సరాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. తమ స్నేహితులతో కలిసి వీళ్ళు వెకేషన్ టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా అక్కడి అందమైన ప్రదేశాల్లో వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ తాలూకు పిక్స్ షేర్ చేసింది శివానీ.
బికినీ వేసి ఫుల్ ఎంజాయ్!
సింగపూర్ లోని మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను శివానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. రాజశేఖర్ కూతుళ్ళ ఎంజాయ్ చూసి వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా..
కొత్త సంవత్సరం వస్తున్న సందర్బంగా ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ షూటింగ్ పనులను పక్కనబెట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళుతున్నాడు. వారం రోజుల పాటు యూరప్‌లో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు మహేష్ బాబు.

శివాని ‘2 స్టేట్స్'
ఇక శివానీ, శివాత్మికల సినిమాల విషయానికొస్తే.. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని తమిళంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘2 స్టేట్స్' అనే సినిమాలో నటించింది. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘2 స్టేట్స్' సినిమాకు ఇది రీమేక్. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగింది.
దొరసాని శివాత్మిక
మరోవైపు చిన్న కూతురు శివాత్మిక ‘దొరసాని'గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కాకపోయినా ఆ పాత్రలో శివాత్మిక నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











