twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివానీ, శివాత్మిక షాకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులను మించి ..

    |

    కరోనావైరస్ సంక్షోభం కారణంగా కొనసాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్‌తో తెలుగు చలన చిత్ర సీమ కార్యకలాపాలు, సినిమాల రిలీజ్ షూటింగులు స్తంభించాయి. అయితే పరిశ్రమలో కార్యక్రమాలు లేకపోవడంతో రోజువారీ వేతన జీవుల పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లో పనిచేసే వారి కోసం జీవిత రాజశేఖర్ కుటుంబం ముందుండి నడుస్తున్నది. ఇతర సినీ ప్రముఖులతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సినీ నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ..

    కరోనా సమయంలో బాధితులకు

    కరోనా సమయంలో బాధితులకు

    సినీ పరిశ్రమలో వేతన జీవుల కుటుంబాలను ఆదుకోవడానికి జీవితతో కలిసి నేను సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సంక్షోభం మొదలైనప్పటి నుంచి రోడ్ల పక్కన ఉంటే కుటుంబాలకు, వలస కార్మికులకు, తెలుగు సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు అండగా నిలుచున్నాం. వారికి నిత్యావసర వస్తువులను పంపిణి చేస్తున్నాం అని రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.

    మేముసైతం అంటూ నా బిడ్డలు శివానీ, శివాత్మికలు

    మేముసైతం అంటూ నా బిడ్డలు శివానీ, శివాత్మికలు

    జీవితనే కాకుండా నా కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా క్రైసిస్ చారిటీలో భాగమయ్యారు. వారు తాము సంపాదనలో నుంచి చెరో లక్ష రూపాయలు సినీ కార్మికుల ఉపాధి నిధికి విరాళంగా ఇచ్చారు. ఇది చిన్నమొత్తమైనా మా వంతుగా, మా శక్తి మేరకు సంక్షోభం ముగిసే వరకు ఏదో ఒక రూపంలో సహయం చేయాలని భావిస్తున్నాం అని రాజశేఖర్ పేర్కొన్నారు.

    నిత్యావసర వస్తువుల పంపిణి

    నిత్యావసర వస్తువుల పంపిణి

    కరోనా విలయంపై పోరాటం చేయడానికి తెలుగు పరిశ్రమ అంతా ఐక్యంగా నిలువడం చాలా హ్యాపీగా ఉంది. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను సప్లై చేస్తున్న వారికి, రేయింబవళ్లు పనిచేస్తన్న పోలీసులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో అన్ని వర్గాల వారు అందరికీ అండగా నిలువాలని, వీలైనంత సహాయం చేయాలని కోరుతున్నాను అని రాజశేఖర్ పేర్కొన్నారు.

    Recommended Video

    Hero Rajasekhar Super Funny Speech At Kalki Movie Trailer Launch || Filmibeat Telugu
    శివానీ, శివాత్మిక విరాళం

    శివానీ, శివాత్మిక విరాళం

    తెలుగు చలన చిత్రసీమ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో దినసరి వేతన కార్మికులకు అండగా నిలువాలని నిర్ణయించుకొన్నాం. మాతల్లిదండ్రులు జీవిత రాజశేఖర్ అడుగు జాడల్లో నడుస్తూ కరోనా క్రైసిప్ చారిటీకి చెరో లక్ష రూపాయలు విరాళంగా అందించాలని అనుకొంటున్నాం అని శివానీ, శివాత్మిక ఓ ప్రకటనలో తెలిపారు.

    English summary
    Shivani, Shivathmika Rajasekhar donation for Corona Crisis Charity. This star daughters follow ActorRajasekhar and #JeevithaRajasekhar footsteps, donates 1 lakh Rs. each from their earnings for #CoronaCrisisCharity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X