స్టార్ హీరో కూతురు ప్రేమాయణం, నిశ్చితార్థం (ఫోటోస్)
బెంగుళూరు: సాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూతురు డా.నిరుపమ(27) ఎంగేజ్మెంట్ ఇటీవల(ఆగస్టు 3) బెంగుళూరులో గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఎంగేజ్మెంటు వేడుకకు సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. డాక్టర్ అయిన నిరుపమ తన కొలిగ్ అయిన దిలీప్ తో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి సిద్ధమయ్యారు. త్వరలో వివాహ తేదీ ప్రకటించనున్నారు.
ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో నిరుపమ, దిలీప్ క్లాస్ మేట్స్. అలా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి అభిరుచులు, ప్రొఫెషన్ ఒకటే కావడంతో ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వైపు దారి తీసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
అందుకు సంబంధించిన ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం....

ఎంగేజ్మెంట్ సెర్మనీ
ఎంగేజ్మెంట్ సెర్మనీ సందర్భంగా రింగులు మార్చుకుంటున్న నిరుపమ, దిలీప్

రబెల్ స్టార్ బ్లెస్సింగ్స్
కన్నడ రెబల్ స్టార్ అంబరీస్ దంపతులు నిరుపమ, దీలీప్ లను ఆశీర్వదించారు.

క్రేజీ స్టార్ బ్లెస్సింగ్
కన్నడ క్రేజీ స్టార్ రవీంద్రన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

శివరాజ్ కుమార్ దంపతులు
కూతురు నిశ్చితార్థం సందర్భంగా శివరాజ్ కుమార్, గీత దంపతులు ఇలా ఫోటోలుకు ఫోజులు ఇచ్చారు.

గర్వంగా...
కూతురు నిశ్చితార్థం సందర్భంగా శివరాజ్ కుమార్-గీత దంపతులు గర్వంగా ఫీలయ్యారు.

ఫాదర్, గ్రాండ్ మదర్
ఈ నిశ్చితార్థ వేడుకకు నిరుపమ గ్రాండ్ మదర్, రాజ్ కుమార్ భార్య అయిన పార్వతమ్మ కూడా హాజరయ్యారు.

సంతోషంగా...
తమకు అల్లుడు దిలీప్ పట్ల రాజ్ కుమార్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

సాండల్ వుడ్ ప్రముఖులు
సాండల్ వుడ్ ప్రముఖులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











