twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోల మధ్య టైటిల్‌ వివాదం

    By Srikanya
    |

    బెంగళూరు : ఒకే టైటిల్ ని ఇద్దరు నిర్మాతలు కానీ, హీరోలు కానీ కావాలని పట్టుబట్టినప్పుడు వివాదాలు మొదలవుతాయి. అయితే చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలకు అనుకున్న టైటిల్స్ కొత్త ప్రొడక్షన్ కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా రిజిస్టర్ చేసి, తర్వాత మీకు మా టైటిల్ కావాలంటే ఇంత డబ్బు ఇవ్వండి అంటూ డిమాండ్ చేయటం జరుగుతూ వస్తోంది. అయితే ఇద్దరి స్టార్ హీరోలు తమకు ఒకే టైటిల్ కావాలని కోరుకుంటే ఎలాంటి పరిష్కారం దొరుతుంది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

    చందనసీమ(కన్నడ చిత్ర పరిశ్రమ)లో సినిమా పేరు వివాదం పరిష్కారమైంది. 'లీడర్‌' పేరు కోసం హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌, సుదీప్‌ల సినిమాల్ని ప్రకటించారు. ఒకే పేరుతో రెండు సినిమాల్ని ప్రకటించడంతో వివాదం తలెత్తింది. సోమవారం ఇక్కడి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. వివాదాన్ని చర్చించింది.

    చివరకు సుదీప్‌ హీరోగా రూపొందే సినిమాకు ది లీడర్‌, శివరాజ్‌కుమార్‌ హీరోగా రూపొందే సినిమాకు మాస్‌ లీడర్‌ అని పేరుపెట్టాలని సూచించారు. సమావేశానంతరం మండలి అధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ ఇకముందు టైటిల్‌ వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని చెప్పారు. నిర్మాతల ఒత్తిళ్ల కారణంగానే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇక తెలుగులో ఇప్పటికే లీడర్ టైటిల్ తో రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం వచ్చి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

    Shivaraj Kumar Vs Sudeep Fight Surfaces Again

    సుదీప్ చిత్రాల విషయానికి వస్తే..

    'మిర్చి' కన్నడ రీమేక్‌తో సక్సెస్ కొట్టిన సుదీప్....మరో తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ని రానా గా ఫైనలైజ్ చేసి, సుదీప్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.

    అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగులో ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కన్నడ వెర్షన్ కు గానూ నంద కిషోర్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది.

    కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి' సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య' పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు.

    English summary
    Recently, director Prakash announced that he was joining hands with Sudeep for a project titled "The Leader". But on Friday, (9 October), a new project of Shivanna was announced with the title – "The Leader Shivaraj Kumar". The makers of the movie had given an ad in a leading daily and it has come as a shock to the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X