హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి సీరియస్.. ప్రార్థించండి అంటూ.. కూతురు శివాత్మిక షాకింగ్ ట్వీట్

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ జనం నుంచి సెలబ్రీటిల వరకు అందరూ కోవిడ్ 19 బారిన పడుతున్నారు. తాజాగా సినీ హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అయితే కరోనా పరిస్థితి కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కష్టంగా ఉందని కూతురు శివాత్మిక రాజశేఖర్ చేసిన ట్వీట్ ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

కరోనా బారిన మా కుటుంబం

కరోనా బారిన మా కుటుంబం


హీరో రాజశేఖర్ సోషల్ మీడియాలో మీడియాలో తమ కుటుంబానికి కరోనావైరస్ పాజిటివ్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. జీవిత, నా పిల్లలిద్దరు, నాకు కరోనావైరస్ సోకిందనే విషయం నిజమే. కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్‌లో చేరాం. ప్రస్తుతం మాకు చికిత్స జరుగుతున్నది. నా పిల్లలిద్దరికి నయమైనది. జీవితకు, నాకు కాస్త ఉపశమనంగా ఉంది. త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతాం అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.

హీరో రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ

హీరో రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ

హీరో రాజశేఖర్ కుటుంబానికి కరోనావైరస్ సోకిందనే విషయం బయటకు రావడంతో సినీ వర్గాలు ఆందోళన చెందారు. వారికి మనోధైర్యాన్ని ఇస్తూ వారిని పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు వారి ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు. అయితే అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో నాన్న ఆరోగ్య పరిస్థితి కష్టంగా మారిందని శివాత్మిక ట్వీట్ చేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

నాన్న ఆరోగ్యం కష్టంగా శివాత్మిక ట్వీట్

నాన్న ఆరోగ్యం కష్టంగా శివాత్మిక ట్వీట్


తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్యం గురించి శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేసి.. కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆ వ్యాధితో నాన్న పోరాటం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఇంకా దానితో శక్తినంత కూడగట్టుకొని పోరాటం చేస్తున్నారు. మీ ప్రార్థనలు, దీవెనలే మాకు రక్షణగా నిలుస్తాయని నమ్ముతున్నాం అని శివాత్మిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించండి

నాన్న ఆరోగ్యం కోసం ప్రార్థించండి

కరోనావైరస్ నుంచి నాన్న త్వరగా బయటపడాలని కోరుకొంటున్నాం. మీరంత నాన్న ఆరోగ్య కోసం ప్రార్థించండి. మీ ప్రేమానురాగాలతోనే ఆయన క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు అంటూ శివాత్మిక అభిమానులకు ట్వీట్ ద్వారా వేడుకొన్నారు. దాంతో హీరో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.

Recommended Video

Gaddar Video Song Making
హీరో రాజశేఖర్‌ కోసం అభిమానులు

హీరో రాజశేఖర్‌ కోసం అభిమానులు


హీరో రాజశేఖర్ తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలతో యుద్ధం చేశారు. ఆయనలో ఓ మంచి ఫైటర్ ఉన్నారు. కోవిడ్‌ను ఎదిరించే మనోధైర్యం ఆయనకు ఉంది. అభిమానులు దీవెనలు, ప్రార్థనలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి అంటూ నెటిజన్లు శివాత్మిక ట్వీట్‌కు స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X