విజయ్ దేవరకొండను చంపి తమ్ముడిని పెళ్లాడుతానంటున్న... రాజశేఖర్ కూతురు!

Recommended Video

Shivathmika Wants To Marry Anand And Kill Vijay Devarakonda || Filmibeat Telugu

జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక త్వరలో 'దొరసాని' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేరవకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. 1980 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాత్మిక... దేవకి అనే దొరసాని పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే విడుదలైన 'దొరసాని' టీజర్, సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఆనంద్, శివాత్మికకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇద్దరూ ఓ రేడియో కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఎగ్జైట్మెంటుతో పాటు భయంగా ఉందంటున్న శివాత్మిక

ఎగ్జైట్మెంటుతో పాటు భయంగా ఉందంటున్న శివాత్మిక

‘‘దొరసాని నాకు ఫస్ట్ మూవీ. ఎగ్జైట్మెంటుతో పాటు భయంగా కూడా ఉంది. ఇంతకు ముందు యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు. చిన్నతనంలో నాన్న మూవీ ‘రాజసింహం'లో చైల్డ్ ఆర్టిస్టుగా ఓ చిన్న పాత్రలో నటించా, ఇంకో సినిమా గురించి నేను చెప్పను మీరు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది'' అని శివాత్మిక తెలిపారు.

అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది

అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది

వాస్తవానికి ఈ సంవత్సరం నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా ‘దొరసాని' సినిమా చేసే అవకాశం వచ్చింది. మంచి కథ కావడంతో అమ్మా నాన్న కూడా చేయమని ప్రోత్సహించారని, సినిమా మొదలవ్వడానికి ముందు యాక్టింగ్ వర్క్ షాప్ చేసినట్లు శివాత్మిక తెలిపారు.

విజయ్ దేవరకొండను చంపి... ఆనంద్ దేవరకొండను పెళ్లాడుతా

విజయ్ దేవరకొండను చంపి... ఆనంద్ దేవరకొండను పెళ్లాడుతా

కిల్, మ్యారీ, హుక్ అప్.... ఈ మూడు అంశాల విషయంలో ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, మహేష్ బాబులో ఎవరిని దేనికి ఎంచుకుంటారు? అనే రాపిడ్ ఫైర్ ప్రశ్నకు శివాత్మిక స్పందిస్తూ... విజయ్‌ను చంపేస్తాను, ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటాను. మహేష్ బాబుతో హుక్ అప్ ప్రిఫర్ చేస్తాను అన్నారు.

నటిని కాకపోయి ఉంటే...

నటిని కాకపోయి ఉంటే...

నటన వైపు రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటారు? అనే ప్రశ్నకు శివాత్మిక స్పందిస్తూ.... మెడిసిన్ అంటూ సమాధానం ఇచ్చారు. మా ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, మా సిస్టర్ డాక్టర్, నాన్న కూడా డాక్టర్ కాబట్టి చిన్నతనం నుంచి మెడిసిన్ మీద ఆసక్తి ఉండేదని శివాత్మిక తెలిపారు.

దొరసాని

దొరసాని

‘దొరసాని' సినిమా విషయానికొస్తే.. షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 1980 కాలం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ రియల్ లైఫ్ సంఘటనలను స్పూర్తిగా తీసుకుని ‘దొరసాని' కథను తయారు చేసినట్లు, దీన్ని పూర్తి చేయడానికి తనకు 5 సంవత్సరాల సమయం పట్టినట్లు కెవిఆర్ మహేంద్ర తెలిపారు. అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఒక టీనేజీ జంట మధ్య ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందనేది ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు. జులై 5న విడుదల కాబోతున్న దొరసాని చిత్రాన్ని నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X