twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనాలి బింద్రేను కిడ్నాప్ చేద్దామనుకున్న షోయబ్ అక్తర్: బయటపడ్డ సీక్రెట్..

    |

    Recommended Video

    ప్రేమ విషయం బయటపెట్టిన మరో స్టార్ క్రికెటర్..

    మైదానాల్లో క్రికెటర్లు కొట్టే షాట్స్ బౌండరీలు దాటి బాలీవుడ్ హీరోయిన్ల గుండెల్లో పడ్డ సందర్భాలు అనేకం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్, టీమిండియా స్టార్ క్రికెటర్స్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ చాలాకాలంగా సాగుతూనే ఉంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న విరాట్-అనుష్క జంట కూడా ఇదే తరహాలో ఒక్కటయ్యారు.

    తారలు, క్రికెటర్లు: లవ్ స్టోరీలు

    అయితే పెళ్లి దాకా వెళ్లని ప్రేమాయణాలు కూడా బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ప్రేమాయణం పక్కనపెడితే.. తానైతే ప్రపోజల్ దాకా కూడా వెళ్లలేదని కొత్త విషయం బయటపెట్డాడు మాజీ పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్..

    సోనాలిపై ప్రేమ..:

    సోనాలిపై ప్రేమ..:

    షోయబ్ అక్తర్ ఇటీవల ఓ టీవి చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ప్రేమ వ్యవహారాల గురించి ప్రస్తావన రాగా.. ఇప్పటిదాకా బయటపెట్టని సీక్రెట్ ఒకటి చెప్పారు. బాలీవుడ్ నటి సోనాలి బింద్రేను తాను అమితంగా ప్రేమించినట్లు చెప్పారు.

    కలిసి.. చెబుదామనుకున్నా!:

    కలిసి.. చెబుదామనుకున్నా!:

    'బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే అంటే నాకు ఎంతో ఇష్టం. ఒకసారి ఆమెను కలిసేందుకు వెళ్తానని మా జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాను. వారు సరే అన్నారు. దీంతో ఆమెను కలిసి నా ప్రేమ విషయం చెబుదామనుకున్నా' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

     ఒప్పుకోకపోతే.. కిడ్నాప్:

    ఒప్పుకోకపోతే.. కిడ్నాప్:

    అంతేకాదు.. ఒకవేళ తన ప్రేమను సోనాలి ఒప్పుకోకపోతే కిడ్నాప్ కూడా చేద్దామనుకున్నాడట ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్. అక్తర్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లోనూ, క్రికెట్ వర్గాల్లోను హాట్ టాపిక్ గా మారాయి.

    పర్సులో సోనాలి ఫోటో:

    పర్సులో సోనాలి ఫోటో:

    సోనాలి అంటే తనకు ఎంత ఇష్టమంటే.. పర్సులో ఎప్పుడూ ఆమె ఫోటోనే పెట్టుకుని తిరిగేవాడినని అక్తర్ చెప్పారు. ఈ విషయం తెలిసి తన సహచర ఆటగాళ్లు ఆటపట్టించేవాళ్లని చెప్పుకొచ్చారు.

     కానీ.. కుదరలేదు..:

    కానీ.. కుదరలేదు..:

    సోనాలిని ఎంత ప్రేమించినప్పటికీ.. ఆమెను కలవడం కుదరలేదని, తన ప్రేమ గురించి చెప్పడమూ జరగలేదని అక్తర్ వివరించారు. మొత్తానికి సోనాలి సొట్టబుగ్గల అందానికి ఈ ఫాస్ట్ బౌలర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడన్నమాట.

     సోనాలి ఏం చేస్తోంది:

    సోనాలి ఏం చేస్తోంది:

    1994లో ఆగ్ సినిమాతో తెరంగేట్రం చేసిన సోనాలి.. 2013లో వచ్చిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. అందం, తనదైన నటనతో సోనాలి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఖడ్గం సినిమాలో 'నువ్వు.. నువ్వు..' అంటూ సాగే రొమాంటిక్ పాటలో సోనాలిని ఇప్పటికీ మర్చిపోలేం. ప్రస్తుతం హిందీలో ఆమె కొన్ని టీవి షోలు చేస్తున్నారు.

    English summary
    In a recent event, it was revealed that there was a time when Pakistani speedster Shoaib Akhtar was a die-hard fan of Sonali Bendre, the beautiful Bollywood actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X