రజనీకాంత్ సినిమాలో శోభన?
ఎన్నో ఆశలతో మొదలు పెట్టిన 'రాణా' సినిమా తన అనారోగ్యం కారణంగా చేయలేని పరిస్థతి ఏర్పడటంతో.....హీరో రజనీకాంత్ ఆ సినిమాను పక్కన పెట్టి కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' అనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అవగా... ఈ సినిమాకు గాను రజనీ చెల్లెలు పాత్రలో స్నేహ, ఇతర పాత్రల్లో హీరో శరత్ కుమార్, హీరో ఆది ఎంపికయ్యారు. ఇంకా హీరోయిన్ ఎంపిక ఖరారు కాలేదు. కత్రినాతో పాటు చాలా మంది అందమైన ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా చెన్నయ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అలనాటి స్టార్ హీరోయిన్, డాన్సర్ శోభన ఓ ప్రముఖ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
రజనీకూతురు సౌందర్య తొలిసారి ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఆమెకు దర్శకత్వం కొత్త కావడంతో కె.ఎస్.రవికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు హ్యాండిల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











