బాలీవుడ్ లో తాజా సంచలనాలుగా పేర్కొనబదుతున్న సోనమ్ కపూర్, దీపికా పదుకునేలకు అంత దృశ్యం'(సీన్) లేదని, ముఖ్యంగా సోనమ్ కపూర్‌లో సెక్సప్పీల్' కొరవడిందని, దీపికాది చాలా సాదాసీదా అందమని '' ప్రముఖ ఆంగ్ల రచయిత్రి (ఇండియన్ ఇంగ్లీష్ రైటర్) శోభాడే విమర్శించారు. దాంతో ఆ హీరోయిన్స్ ఇద్దరూ ఆమెపై మాటల దాడికి సిద్దపడుతున్నారు. బూతు రచనలు చేసుకునే ఆ ముదుసలికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు' అంటూ ఆ భామలిద్దరూ శోభాడే పై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శోభాడే తన రచనలు, తను నిర్వహించే శీర్షికలు మాతమ్రే కాదు, తను కూడా సెక్సీగానే వుండాలని తాప్తయ్రపడుతుంటారు . కనుకనే.. ఆరు పదులు దాటినా కూడా, పత్రికలకు సెక్సీగా ఫోజులివ్వడం ద్వారా ఉచితంగా లభించే ప్రచారాన్ని ఆమె అమితంగా ఆస్వాదిస్తుంటారు.